రష్మికను కార్నర్ చేస్తూ రక్షిత్ శెట్టి సంచలన వ్యాఖ్యలు !

Seetha Sailaja

టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం రష్మిక హవా కొనసాగుతోంది. ఆమెతో నటించాలని టాప్ యంగ్ హీరోల నుండి మీడియం రేంజ్ హీరోల వరకు ఆసక్తి కనపరుస్తున్నారు. ఆమె కోరుకున్న స్థాయిలో భారీ పారితోషికం ఇవ్వడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నా ఆమె వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకోకుండా చాల సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ఆమె మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొదటిసారి రష్మికతో తనకు ఏర్పడ్డ బ్రేకప్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 


ప్రస్తుతం ఈ కన్నడ యంగ్ హీరో నటిస్తున్న ‘అతడే శ్రీమన్నారాయణ’ మూవీని తెలుగులో కూడ డబ్ చేసి విడుదల చేస్తున్నారు. రష్మిక మాజీ బాయ్ ఫ్రెండ్ అన్న క్రేజ్ తో యూత్ లో రక్షిత్ శెట్టికి పేరును క్యాష్ చేసుకోవడానికి ఈ మూవీని తెలుగులో కూడ విడుదల చేస్తూ రక్షిత్ చేత స్వయంగా ఇంటర్వ్యూలు ఇప్పిస్తున్నారు. ఈ సందర్భంలో ఆ మీడియా సంస్థ ప్రతినిధి రక్షిత్ ను రష్మికతో బ్రేకప్ విషయమై ప్రశ్నలు అడిగాడు. 


అయితే రక్షిత్ ఈ ప్రశ్నలకు దాటవేసే సమాధానం ఇవ్వకుండా చాల క్లారిటీతో సమాధానం ఇచ్చాడు. జీవితంలో అనేక అనుభవాలు ఉంటాయని ఆ అనుభవాలు కొన్ని ఆనందాన్ని కలిగించేవి అయితే మరికొన్ని బాధను కలిగించేవిగా ఉంటాయని అభిప్రాయపడ్డాడు. అయితే ఈ అనుభవాలకంటే జీవితం చాల పెద్దది అంటూ జరిగిన సంఘటనలను గురించి బాధ పడుతూ తాను తన కెరియర్ ను పాడుచేసుకోను అంటూ కామెంట్స్ చేసాడు. 

అంతేకాదు రిలేషన్ షిప్స్ లో మాత్రమే కాదు స్నేహంలో బంధుత్వాలలో కూడ బ్రేకప్ లు వస్తాయని అంతమాత్రం చేత జీవితం ఆగిపోదు అంటూ రష్మిక కెరియర్ బాగుండాలని తాను కోరుకుంటున్నాను అంటూ వ్యూహాత్మకంగా కామెంట్ చేసాడు. కన్నడంలో విడుదలైన ‘కిర్రాక్ పార్టీ’ తో కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అయిన రష్మిక రక్షిత్ లలో ప్రస్తుతం రష్మిక టాప్ రేంజ్ లో ఉంటే ఇంకా రక్షిత్ హీరోగా సెటిల్ కావడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: