నువ్వు డ్రగ్ అడిక్ట్వా అని మహేష్‌బాబు అన్నారా?
`వెన్నెల` చిత్రంతో టాలీవుడ్‌కి పరియమై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరును సంపాదించారు రవివర్మ. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. రవివర్మ డ్రగ్ అడిక్ట్ పాత్రలో ఒకరకంగా చెప్పాలంటే చింపేశాడనే చెప్పాలి అంత బాగా నటించాడు. ఇక ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ అతి తక్కువ కాలంలోనే మంచి పేరును సంపాదించారు. ఇక ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్ మహేష్ కూడా చూశారట. ఈ విషయాన్ని రవి వర్మ ఓ సందర్భంలో తెలిపారు. ఓ సినిమా షూటింగ్లో మహేష్.. రవి వర్మను చూడగానే ఓ ప్రశ్న అడిగారట. అది విని తాను షాకయ్యానని రవి వర్మ అన్నారు.
‘అయితే నువ్వు డ్రగ్స్ బాగా తీసుకుంటావన్నమాట’ అని మహేష్ అన్నారట. దాంతో సెట్స్‌లో ఉన్నవారంతా పగలబడి నవ్వుకున్నారట. 2015లో వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమాలో రవి వర్మ నటించారు. ‘అసుర’, ‘క్షణం’, ‘టెర్రర్’, ‘రాజా చెయ్యి వేస్తే’, ‘సత్య’ టాక్సీడ్రైవర్ వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు రవి వర్మ. ప్రస్తుతం మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో రష్మిక మందన కథానాయికగా నటిస్తున్నారు. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ సాంగ్ మైండ్ బ్లాక్' కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటకి వచ్చిన పాపులారిటీ దృష్ట్యా మేకర్స్ స్పెషల్ కాంటెస్ట్ లు కూడా అనౌన్స్ చేశారు. చార్ట్ బస్టర్ గా నిలిచిన ఫస్ట్ సాంగ్ తర్వాత `సరిలేరు నీకెవ్వరు` చిత్రం నుండి సెకండ్ సింగిల్ సూర్యుడివో చంద్రుడివో... సోల్ ఫుల్ మెలోడీ ని డిసెంబర్ 9 (సోమవారం) సాయంత్రం 5:04 నిమిషాలకు విడుదలచేయనుంది చిత్ర యూనిట్. సంక్రాంతి కానుకగా జనవరి11నప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.
సూపర్‌స్టార్ మహేష్, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, సంగీత, బండ్ల గణేష్ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్, రత్నవేలు, కిశోర్ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్, యుగంధర్ టి., ఎస్.కృష్ణ సాంకేతిక వర్గం.