బాగా కష్టపడుతున్న చిరంజీవి..!
ఆరు పదుల వయసులో జిమ్ లో కసరత్తులు చేస్తూ శ్రమిస్తున్నారు. చిరంజీవి జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఫోటో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఫిజికల్ ట్రైనర్ ఆధ్వర్యంలో చిరంజీవి బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక డైట్ ని కూడా ఫాలో అవుతున్నారు. అంటే త్వరలోనే క్రేజీ లుక్ లో మెగాస్టార్ ని చూడొచ్చు. కొరటాల శివ తెరకెక్కించబోయే ఈ చిత్రం దేవాదాయశాఖకు సంబంధించిన కథాంశంతో ఉండబోతున్నట్లు..చిరంజీవి దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగిగా పని చేసే పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు గట్టిగా వినపడుతున్నాయి.
దీంతో దేవాదాయ శాఖలో ఉండే అవినీతిని పారదోలే విధంగా చిరంజీవి సినిమాలో ప్రముఖ రోల్ పాత్ర పోటీ చేస్తున్నట్లు వార్తలు రావడంతో ఆ పాత్ర కోసం బరువు తగ్గే పనిలో చిరంజీవి ప్రస్తుతం జిమ్ లో కష్టపడుతున్నరు. దీంతో తాజాగా చిరంజీవి జిమ్ లో చేస్తున్న ఎక్సర్సైజ్ ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్న నేపథ్యంలో మెగా అభిమానులు చిరంజీవి ఫోటోలు చూసి సినిమా కోసం ఆరు పదుల వయసులో కూడా బాగా కష్ట పడుతున్నారు అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.