అందాల ముద్దుగుమ్మ అనుష్క.. టాలీవుడ్ లో సూపర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.... తన అందంతో అందరి మతి పోగొట్టింది. ఇక ఆ తర్వాత అటు కుర్రహీరోలు సీనియర్ హీరోల సరసన నటిస్తూ తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్నది ఈ అమ్మడు. ఇక ఈ అమ్మడి నటనకు గురించి అయితే కొత్తగా చెప్పాల్సిన పనిలేదు ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోయి నటిస్తోంది అనుష్క శెట్టి. తన అందాల ఆరబోతతో ప్రేక్షకులందరికీ చెమటలు పట్టించగలదు... తన అభినయంతో అందరి మతి పోగట్టే గలదు అనుష్క శెట్టి. అందం అభినయం కలగలిసిన చందమామ లాంటి ముద్దుగుమ్మ అనుష్క శెట్టి. ఇక అభిమానులు, ఇండస్ట్రీ మొత్తం ఆమెను ముద్దుగా స్వీటీ అని పిలుస్తుంటారు. గ్లామరస్ హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి ఆ తర్వాత నటనకు ప్రాధాన్యం ఉన్న విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది.
అయితే అనుష్క శెట్టి గురించి మీకు తెలియని కొన్ని విషయాలు మీ కోసం. అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి సినిమాల్లోకి వచ్చాక అనుష్క గా మారిపోయింది. బేసిక్ గా అయితే ఈ అమ్మడు చాలా సిగ్గరి. ప్రొఫెషనల్ యోగా ట్రైనర్ గా ఉన్న అనుష్క శెట్టి అసలు సినిమాల్లోకి వస్తానని ఎప్పుడు ఆలోచన కూడా చేయలేదట. అయితే తనకు నటన డాన్స్ రాకపోయినప్పటికీ ఈ స్థాయికి చేరుకోవడం కారణం తన హార్డ్ వర్క్ అంటుంది స్వీటీ శెట్టి . అయితే సినిమాల్లో గ్లామర్ గా కనిపిస్తూ ప్రేక్షకులందరిలో సెగ పుట్టిస్తు చమటలు పటించే అనుష్క శెట్టి... బయట మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది. చీరలు చుడీదార్ల తోనే ఎక్కువగా బయట దర్శనమిస్తుంటుంది ఈ అమ్మడు. సూపర్ సినిమా ఆడిషన్ కోసం పూరీ జగన్నాథ్ అనుష్క ని ఫోటో అడిగితే తన పర్స్ లో ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసి ఇచ్చిందట... ఇక ఆడిషన్ కోసం ఎలా పోస్ ఇవ్వాలో కూడా తెలియని అనుష్క కు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నటన నేర్పించారట.
ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అనుష్క వెనక్కి తిరిగి చూసింది లేదు. అయితే సినిమాల్లో ఎంతో ధైర్యంగా కనిపించే అనుష్క నిజ జీవితంలో మాత్రం చాలా భయస్తురాలిని అని చెబుతోంది. ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలో కొన్ని రిస్కీ షాట్స్ నటించి ఏడ్చేసిందట స్వీటీ బ్యూటీ. అంతేకాదు ఒక రాజమౌళి దర్శకత్వంలో ఒకటికీ మించి సినిమాలు చేసిన మొదటి హీరోయిన్ అనుష్క నే . అటు విక్రమార్కుడు బాహుబలి బాహుబలి 2 సినిమాల్లో రాజమౌళి దర్శకత్వంలో నటించింది అనుష్క శెట్టి. అయితే జీరో సైజ్ లాంటి ప్రయోగాత్మక సినిమాతో బాగా లావెక్కి పోయిన ఈ అమ్మడు.. ఆ తర్వాత సన్నగా అవ్వడానికి అష్టకష్టాలు పడింది. ఇక చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు భాగమతి శసినిమాతో అదరగొట్టింది. ఇక అప్పటి నుంచి దర్శకుల అందరికీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు అనుష్క కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అయితే ఈ అమ్మడుకి ఇష్టమైన నటులు అమితాబ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ లట .. అంతేకాకుండా ఫ్రెంచ్ మూవీ లో నటించాలని అనుష్కకి కోరిక ఉందట. అయితే తాను నటనకు స్వస్తి చెప్పాక చిన్న పిల్లలకు పాఠాలు చెబుతు ఉంటుందట అనుష్క శెట్టి.