అదిరిపోయే కాంబినేషన్ ప్రభాస్ -రామ్ చరణ్ సినిమా..?
అంతేకాకుండా ఈ సినిమాలో త్రిషా హీరోయిన్ గా ఎంపికైనట్లు కూడా సమాచారం. అయితే ఈ సినిమా తర్వాత కొరటాల తో రామ్ చరణ్ సినిమా కూడా ఉండబోతుంది అది కూడా కొణిదెల ప్రొడక్షన్ లోనే చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చిరుతో సినిమా చేస్తున్నాడు కొరటాల.. మరోపక్క రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. చిరు-కొరటాల కాంబినేషన్ లో సినిమా రావడానికి చాలానే టైం పడుతుంది. ఇక అన్నీ కుదిరితే వీరిద్దరితో సినిమా అయిపోయిన తర్వాత ప్రభాస్ తో కొత్త సినిమా చేయనున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ప్రభాస్ సినిమాను యూవీ క్రియేషన్ తో పాటు రామ్ చరణ్ కూడా నిర్మించనున్నాడట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంది. కాగా అప్పట్లో సాహో సినిమాని నిర్మించిన నిర్మాతలు యు.వి.క్రియేషన్స్ సంస్ద చెందినవారు నెల్లూరులో నిర్మించిన భారీ మల్టీప్లెక్స్ థియేటర్ ని రామ్ చరణ్ ఓపెనింగ్ చేయడం బట్టి చూస్తుంటే కచ్చితంగా ప్రభాస్ ని హీరోగా పెట్టి యు.వి.క్రియేషన్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ వాళ్లు సినిమా చేయడానికి ఆస్కారం ఉన్నట్టే తెలుస్తుంది.