గడ్డం కథ : హీరో నానికి షాక్ ఇచ్చిన సద్గురు..?

Chakravarthi Kalyan

ఎవరైనా గడ్డం ఎందుకు పెంచుతారు.. ఇది చాలా సిల్లీ ప్రశ్నగా అనిపిస్తుంది.. కానీ ఇందుకు చెప్పే సమాధానం మాత్రం ఒక్కొక్కరు ఒక్కోలా ఇస్తారు. హీరో నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు కూడా గడ్డం పెంచేవాడట.


ఎందుకంటే.. మిగతావాళ్లు తనని చూసి పనిలో సీరియస్‌నెస్‌ ఉంటుందని భావిస్తారనే ఉద్దేశంతో అలా చేసేవాడట. అలాంటి నాని ఇటీవల ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ను ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో మీరు గడ్డం ఎందుకు పెంచుతారని సద్గురును అడిగాడు నాని.


అందుకు సద్గురు నానికి దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు.

ఆయన ఏమన్నారంటే..


“ ‘ఈ ప్రకృతి అనవసరంగా ఏదీ మనకు ఇవ్వదు. అన్ని విలువైనవే ఇస్తుంది. కొందరు ప్రజలు తమ జుట్టును కత్తిరించుకుంటారు. మరికొందరు తమ బుర్రలను త్యాగం చేస్తారు. ఇంకొందరు తన ప్రియురాలి కోసం కిడ్నీలను సైతం దానం చేస్తారు. నా వరకూ ప్రతిదానిని యథావిధిగా ఉంచితేనే ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నా’నన్నారు సద్గురు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: