సూర్య సినిమా కోసం రంగంలోకి దిగిన రాజమౌళి..!
ఇంతకీ విషయంలోకి వెళితే కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య నటిస్తోన్న కాప్పాన్ మూవీ తెలుగు టైటిల్ ను ఇంకా ప్రకటించలేదు. తెలుగు అభిమానులు ఈ విషయంలో చిత్ర యూనిట్ పై చాలా రోజులుగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు వారందరిని మెప్పించే విధంగా జక్కన్న ద్వారా సినిమా టైటిల్ లుక్ ని విడుదల చేయనున్నారు.
27వ తేదీ గురువారం ఉదయం 10.30 నిమిషాలకు కాప్పాన్ సినిమా తెలుగు టైటిల్ ను రాజమౌళి ద్వారా ఎనౌన్స్ చేయనున్నట్లు దర్శకుడు కెవి.ఆనంద్ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చాడు. ఈ సినిమాలో సూర్య తో పాటు మోహన్‌లాల్ మరియు ఆర్య కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. గతంలో సూర్యతో వీడొక్కడే బ్రదర్స్ ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ లు చేసిన ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై చాలా అంచనాలే పెట్టుకున్నారు సూర్య అభిమానులు.