సెన్సేషనల్ యాప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్..!
అసలు విషయంలోకి వెళితే BYJU'S ఆన్ లైన్ యాప్ ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందుతోంది. విద్యార్ధులు ఈ యాప్ ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఈ సంస్థ ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో దృష్టి సారించింది. ఇందులో భాగంగా మహేష్ బాబుని ప్రచారకర్తగా నియమించింది. ఇది ఎడ్యుకేట్ యాప్. విద్యార్ధులకు అవసరమైన శిక్షణకు ఉపకరించే ఎడ్యుకేట్ కంపనీ బైజూస్ యాప్.
ఇప్పుడు దీనికి సంబంధించిన యాడ్ లో మహేష్ బాబు నటించారు. ఈ BYJU'S చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మృణాల్ మోహిత్ మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణా మార్కెట్లు తమకు ఎంతో కీలకమైనవిగా భావిన్నామని చెప్పారు. యాప్ లో రెండు తెలుగు రాష్ట్రాల కు సంబంధించిన విద్యార్థులు సంఖ్య నమోదవడం రోజురోజుకీ పెరుగుతుందని..ఇటువంటి క్రమంలో మహేష్ వంటి ప్రముఖ సెలబ్రిటీ తో ప్రచారం చేయిస్తే మరింతగా విద్యార్థుల అవగాహన అందుబాటులో ఉంటుందని యాప్ నిర్వాహకులు వ్యాఖ్యానించారు.