కళ్యాణ్ దేవ్ తీరు పై జాతీయమీడియా అసహనం !

Seetha Sailaja
చిరంజీవి చిన్న అల్లుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ ప్రవర్తన పై ఒకప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఈరోజు ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. అంతేకాదు చిరంజీవి అల్లుడుగా ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ తన మెగా కుటుంబ వారసత్వాన్నే కాకుండా చిరంజీవిలోని మంచి లక్షణాలను కూడ అలవరచుకోవాలి అంటూ చురకలు అంటించింది.

ఆసక్తికరమైన ఈకథనం వివరాలలోకి వెళితే ఈసంఘటన మొన్న హైదరాబాద్ లో జరిగింది. ‘విజేత’ సక్సస్ మీట్ మధ్యాహ్నం 12గంటలకు అని మీడియా వర్గాలకు పిలుపు రావడంతో మీడియా ప్రతినిధులు అంతా పిలిచిన సమయానికే ఆ సక్సస్ మీట్ జరిగే స్టార్ హోటల్ కు వెళ్ళినట్లు సమాచారం. ఈ సక్సస్ మీట్ కు ముఖ్యఅతిధిగా వచ్చిన అల్లుఅర్జున్ అదేవిధంగా ఈసినిమా హీరోయిన్ మాళవిక నయ్యర్ ఇంచుమించు అనుకున్న సమయానికి అటుఇటుగా వచ్చినా అక్కడ కళ్యాణ్ దేవ్ జాడ కనిపించకపోవడం మీడియా వర్గాలకు షాక్ ఇచ్చిందని ఆపత్రిక కథనం. 

దీనితో ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు కళ్యాణ్ దేవ్ కోసం ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం టెన్షన్ పెట్టినట్లు సమాచారం. అప్పటికే కళ్యాణ్ దేవ్ రాక కోసం ఎదురుచూస్తున్న బన్నీ తనకు ఒకవ్యక్తిగత కార్యక్రమం ఉంది అంటూ ఆకార్యక్రమ నిర్వాహకులకు చెప్పడంతో ఎలెక్ట్ అయిన ఆసక్సస్ మీట్ నిర్వాహకులు ఎట్టకేలకు కళ్యాణ్ దేవ్ ను కాంటాక్ట్ లోకి తీసుకుంటే తాను చిరంజీవి దగ్గర ఉన్నానని ఆహడావిడిలో తాను ఫోన్ కాల్స్ చూసుకోలేదని చెప్పి హడావిడిగా ఆకార్యక్రమం జరుగుతున్న హోటల్ కు మధ్యాహ్నం 1.45లకు చేరుకున్నట్లు తెలుస్తోంది. 

అయితే ఇంత ఆలస్యంగా ఈసక్సస్ మీట్ సమావేశం ప్రారంభం అయినా కనీసం తన గురించి దాదాపు 2 గంటలకు పైగా ఎదురుచూస్తున్న మీడియా ప్రతినిధులకు అతిధులకు ఎటువంటి క్షమార్పణలు చెప్పకుండా అసలు ఏమి జరగనట్లు ప్రవర్తించడం ఆకార్యక్రమానికి వచ్చిన మీడియా ప్రతినిధులకు అతిధులకు తీవ్ర అసహనాన్ని కలిగించింది అంటూ కళ్యాణ్ దేవ్ ప్రతి ఒక్కరినీ వెయిటింగ్ లో పెట్టాడు అంటూ ఒక పతాక శీర్షికతో ఆపత్రిక కథనాన్ని ప్రచురించింది. చిరంజీవి అల్లుడుగా వారసత్వాన్ని కోరుకుంటున్న కళ్యాణ్ దేవ్ చిరంజీవి సంస్కారాన్ని కూడ అలవరుచుకోవాలి అంటూ ఈకథనంలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: