సంచలనంగా మారిన పవన్ ఇచ్చిన ఆరెండు ఆప్షన్స్ !

Seetha Sailaja
ప్రస్తుతం సినిమాలకు దూరమై ప్రజా పోరాట యాత్రలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ విశాఖపట్నం జిల్లాలో ప్రసంగిస్తూ బయటపెట్టిన రెండు ఆప్క్షన్స్ పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.  తనకు సినిమాలు చేయడం కంటే ప్రజా సేవ చేయడమే ఇష్టమని చెపుతూ తన పిల్లలతో తాను ఎక్కువ సమయం గడపలేకపోతున్న విషయమై తన కూతురు పడుతున్న వ్యథను వివరించాడు.

ఇదే సందర్భంలో పవన్ మాట్లాడుతూ వాస్తవానికి తాను నటుడుని కానని అయితే అనుకోకుండా నటుడుగా అవ్వబడ్డాను అంటూ అది భగవంతుడి నిర్ణయం అని అంటున్నాడు పవన్. తాను చేసిన సినిమాలు చాల తక్కువే అయినా కేవలం ఐదు-ఆరు సూపర్ హిట్ సినిమాలతో తనకు వంద సినిమాల క్రేజ్ వచ్చిన విషయాన్ని విఅవరించాడు పవన్.

అయితే ఇలా తనకు క్రేజ్ ఏర్పడటం వెనుక ఏదో ఒక కారణం ఉంది అని అంటూ తనకు సినిమాలకంటే ప్రజా సేవ పట్ల ఇష్టం ఎక్కువ అన్న అభిప్రాయాన్ని మరొకసారి బయటపెడుతూ తన ముందు ఉన్న రెండు ఆప్క్షన్స్ ను వివరించాడు. తనకు భగవంతుడు అనుమతి ఇస్తే ప్రజా క్షేత్రంలో కొనసాగుతానని లేదంటే యోగి మార్గంలోకి వెళ్లిపోతాను అంటూ తన ముందు ఉన్న రెండు ఆప్షన్స్ ను వివరించాడు. 

అయితే  ఎప్పుడూ సన్యాసి అవుతానో మరి ఎప్పుడు సంసారి అవుతానో తనకు తెలియదు అని అంటూ పవన్ కళ్యాణ్ విచిత్ర వ్యాఖ్యాలు చేస్తున్నాడు. ఇదే సందర్భంలో తన పిల్లల పట్ల శ్రద్ద తీసుకోకుండా వారిని వదిలి జనం మధ్య తరుగుతున్న తనగురించి తనపిల్లలు పడుతున్న బాధలు వివరిస్తూ వారి గురించి కన్నీరు కార్చడం తప్ప తానేమి చేయలేను అని అంటూ ఈరోజు ప్రజలు పడుతున్న బాదలతో పోల్చుకుంటే తన బాధ పెద్దది కాదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు పవన్.  తాను ఏమీలేని స్థాయి నుండి వచ్చినా 25 కోట్ల టాక్స్ కట్టే ధనవంతుడిగా తాను మారిన విషయాన్ని వివరిస్తూ సంపద పట్ల సక్సస్ పట్ల తనకు మమకారం లేదని అదే ఉంటే తాను ఎన్ని వందల కోట్లు అయినా గణించగలను అంటూ తనకు ప్రజా క్షేత్రంలో జనం ఓట్లు వేయకపోతే రానున్న రోజులలో యోగి గా మారే అవకాశాలు ఉన్న విషయాలను లీక్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్..   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: