అయ్యో ప్రియా..! కన్ను గీటి కొంప ముంచేస్తున్నావుగా..!!

Vasishta

ఒకే ఒక్క సీన్ తో కుర్రాళ్ల మనసు దోచేసుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. సినిమా ఇంకా రిలీజ్ కాలేదు.. అయినా ఆ అమ్మాయి మాత్రం టాప్ పొజిషన్ కు వెళ్లిపోయింది. కన్ను కొట్టి కుర్రాళ్లందరినీ తన బుట్టలో వేసేసుకున్న ప్రియకు.. చిక్కులు కూడా అంతకు మించే వస్తున్నాయ్.. తాజాగా మరో కేసు ఆ అమ్మాయిపై పడింది.


          ఒక్క కనుసైగతో స్టార్ డమ్ సంపాదించుకుంది మలయాళీ భామ ప్రియా ప్రకాష్ వారియర్. ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఒరు ఆధార్ లవ్ సినిమాలో కన్ను కొడుతూ ప్రియ పిలికించిన హావభావాలు కుర్రాళ్ల మతి పోగొట్టాయి. ఆ అమ్మాయి పలికించిన హావభావాలు విపరీతంగా వైరల్ అయిపోయాయి. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఆ అమ్మాయి ఫీలింగ్సే.! ఆ అమ్మాయిని చూసి తమదైన శైలిలో డబ్ స్మాష్ లు చేసి డిజిటల్ మీడియాను పిచ్చెక్కిచ్చేస్తున్నారు నెటిజన్లు.


          అయితే అన్నీ అనుకున్నట్టు జరిగితే అది సినిమా ఎందుకవుతుంది.? ప్రియా ప్రకాశ్ వారియర్ హావభావాలతో ఎంత పాపులర్ అయిందో.. అంతకు మించి చిక్కుల్లో పడింది. ఈ పాటలోని కొన్ని వాక్యాలు ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ కొంతమంది ప్రియా ప్రకాష్ పై కేసు పెట్టారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి విచారణకు ఆదేశించాలని కోరారు. అయితే ఈ పిటిషన్ పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలంటూ ప్రియా ప్రకాష్ కూడా పిటిషన్ వేసింది. దీంతో స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు.


          అయితే సినిమా మాత్రం వాయిదా పడింది. మార్చి 1వ తేదీ రిలీజ్ కావాల్సిన ఈ మూవీ జూన్ కు వాయిదా పడింది. జూన్ లో అయినా సినిమా రిలీజ్ అవుతుందని భావిస్తున్న తరుణంలో మరికొందరు ఇంకో పిటిషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ కు చెందిన కొంతమంది యువకులు.. కన్ను కొట్టడం ఇస్లాంకు వ్యతిరేకమంటూ పిటిషన్ వేశారు. మరి ఈ కొత్త పిటిషన్ ప్రియా ప్రకాష్ కు ఇంకెన్ని చిక్కులు తెస్తుందో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: