పోలవరం కలవరం: ఈ అద్భుత ప్రాజెక్ట్ నిర్మాణం చంద్రబాబు ఖాతాలోనే పడుతుందా.?

Pandrala Sravanthi
పోలవరం ప్రాజెక్ట్ .. దీనికి డిజైన్ జరిగి  83 సంవత్సరాలు గడిచింది. ఈ సమయంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు మారిపోయారు. అంతే కాదు ఏపీతో  తెలంగాణ ప్రాంతం కూడా సపరేట్ అయింది. అయినా పోలవరం ప్రాజెక్టు మాత్రం పూర్తవడం లేదు.  ఇప్పటికీ కూడా ఈ ప్రాజెక్టుకు ఎలాంటి రూపకల్పన రాలేదు. అలాంటి పోలవరం ప్రాజెక్టును  ఈసారి పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అంటున్నారు. సోమవారం ఆయన ఈ ప్రాజెక్టును సందర్శించారు.  ఈ సందర్భంగా ప్రాజెక్టు అంత ఏరియల్ సర్వే నిర్వహించి పనులు ఎక్కడి వరకు వచ్చాయో అధికారులు అడిగి తెలుసుకున్నారు. 

2019 నుంచి 2023 సమయంలో ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశం ఉన్నా కానీ  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని, ఈ ప్రాజెక్టు పేరుతో ఎన్నో అవకతవకలు చేశారని ఆరోపించారు. ఇక నాలుగు సంవత్సరాల్లో తప్పక ఈ ప్రాజెక్టును పూర్తి చేసి చూపిస్తాను అని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ను పాలించిన మహామహులు ఎవరు కూడా ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ఈ ప్రాజెక్టు పనులు మొదలయ్యేసరికి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. ఈసారి చంద్రబాబు నాయుడు పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. అంతేకాకుండా కేంద్రంలో కింగ్ మేకర్ అయ్యారు. ఈసారి తప్పక ఆయన కేంద్రం మెడలు వంచైనా సరే  ప్రాజెక్టుకు భారీ బడ్జెట్ తీసుకువచ్చి పనులలో వేగం పెంచుతారని తెలుస్తోంది.

ఈ విధంగా ప్రాజెక్టు అనుకున్న నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేసి శంకుస్థాపన చేస్తే మాత్రం  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తరతరాలు గుర్తుంచుకునే విధంగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారని చెప్పవచ్చు. అద్భుత ప్రాజెక్టు  పూర్తి చేసిన సీఎంగా ఆయన పేరు చరిత్రలో లిఖించబడుతుంది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు తప్పక ప్రాజెక్టు పూర్తి చేస్తాననే గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలరు. ఈ ప్రాజెక్టు ఒక లెక్కన అని ప్రస్తుతం తెలుగు తమ్ముళ్లు సంబరపడిపోతున్నారు.మరి చూడాలి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడి ఖాతాలో పడుతుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: