రంగస్థలానికి అదే బిగ్ మైనస్..!?

Chakravarthi Kalyan
సూటిగా సుత్తి లేకుండా.. ఈ డైలాగ్ సినిమాలకు కూడా బాగానే పనికొస్తుంది. ఈ స్పీడ్ యుగంలో ఏదైనా నేరుగా విషయంలోకి వచ్చేయాలి.. సూటిగా చెప్పాల్సింది చెప్పేయాలి.. ఎక్కువ టైమ్ తీసుకోకూడదు..అంత ఓపికలు ఇప్పుడు ఎవరికీ లేవు.. కానీ రంగస్థలం విషయంలో డైరెక్టర్, నిర్మాతలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని చెప్పాలి. 



సినిమా నిడివి విషయం రంగస్థలానికి పెద్ద మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా రన్ టైమ్ 3 గంటలు.. అంత పెద్ద సినిమాలు ఇప్పుడు రావడం లేదు. కొన్ని సినిమాలు బావున్నా.. కేవలం నిడివి కారణంగా మైనస్ అయిన సినిమాలు ఉన్నాయి. ఒకసారి సినిమా రిలీజ్ అయ్యాక ఆ తర్వాత దాన్ని ట్రిమ్ చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.


ఐతే.. రిలీజ్ టాక్ వచ్చిన తర్వాత ఎన్ని కట్ లు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఒక్కసారి టాక్ జనంలోకి వెళ్లాక చేసేదేమీ ఉండదు. మరి అంత పెద్ద సినిమా అలరించేలా ప్రేక్షకులను కూర్చోబెట్టాలంటే సినిమాలో చాలా సరుకు ఉండాలి. సుకుమార్ కథపై నమ్మకం ఉన్నా.. ఏమాత్రం బోర్ కొట్టినా ఫలితం తేడాగా వచ్చే ప్రమాదం ఉంది. మరి రంగ స్థలం విషయంలో ఈ రన్ టైమ్ మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 



ఐతే.. కథ డిమాండ్ చేసిందని.. ఏ ఒక్క ఫ్రేమ్ కూడా అదనంగా లేదని సుకుమార్ నమ్మకంగా చెబుతున్నారు. నిజంగా అంత ఇంట్రస్టింగా ఉంటే నిడివి పెద్ద విషయం కాబోదు. కానీ ఆ స్టోరీ ఎక్స్ట్రార్డినరీగా ఉండాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: