కల్కి సినిమాని పోస్ట్ పోన్ చేయడానికి గల కారణం ఏంటో తెలుసా..!!

murali krishna
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న కల్కి సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకుంది.ఇక చాలా రోజుల నుంచి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తుంది. నిజానికి ఈ సినిమా మే 9వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. కానీ ఈ సినిమాకి సంబంధించిన కొన్ని గ్రాఫికల్ వర్క్స్ బ్యాలెన్స్ ఉండడంతో ఈ డేట్ కి రావడం వీలు కాలేదు.
దాంతో ఈ సినిమాని దాదాపు 50 రోజులపాటు పోస్టు పోన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక కల్కి సినిమా జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అవుతుందంటూ సినిమా యూనిట్ ఒక డేట్ ను అయితే అనౌన్స్ చేశారు. ఇక ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇప్పటికే కల్కి సినిమా కోసం పలు రకాల డేట్లని అనౌన్స్ చేసి పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది అనే దాని మీద సరైన వివరణ అయితే ఇవ్వడం లేదు.
మరి జూన్ 27వ తేదీకైన ఈ సినిమాని రిలీజ్ చేస్తారా లేదా అని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇక జూన్ 27వ తేదీన కనక ఈ సినిమా రాకపోతే ఆ తర్వాత నుంచి మిగతా పెద్ద హీరోల సినిమాలు కూడా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. కాబట్టి ఈ సినిమాకి రిలీజ్ డేట్ అనేది దొరకడం చాలా కష్టమవుతుంది. కాబట్టి జూన్ 27వ తేదీన పక్కాగా రిలీజ్ చేసుకోవాల్సిందే… ఇక ఇలా పలుమార్లు సినిమా డేట్ వాయిదా వేయడంతో సినిమా మీద సగటు ప్రేక్షకుడికి ఉండే ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోతుందనే చెప్పాలి.
ఇక మే 9వ తేదీన రావాల్సిన ఈ సినిమాని పోస్ట్ పోన్ చేయడానికి గల కారణం ఏంటి అంటే సినిమాకు సంబంధించిన వర్క్ కొంచెం బ్యాలెన్స్ ఉండడం ఒకటైతే, మరొకటి ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్స్ టైం లో సినిమాను రిలీజ్ చేస్తే ప్రేక్షకులకు కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశామంటూ ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన అశ్వినీ దత్ తెలియజేసే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీన అయిన పక్కాగా వస్తుందా లేదా అనే విషయం మీద సరైన క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: