బాలయ్య మూవీలో అంత మంది బ్యూటీలు... కానీ వారంతా హీరోయిన్లు కాదు..!

Pulgam Srinivas
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మేకర్స్ ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ బాలయ్య కెరియర్ లో 109 వ సినిమాగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క చిత్రీకరణను ఎన్ బి కె 109 అనే వర్కింగ్ టైటిల్ తో యూనిట్ పూర్తి చేస్తూ వస్తుంది. ఈ సినిమా మొదలు అయినప్పుడు ఈ మూవీ లో ఇద్దరు హీరోయిన్ లు ఉండబోతున్నారు అని వార్తలు వచ్చాయి.

అలాగే అందులో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా కనిపించబోతున్నట్లు కూడా రూమర్స్ వచ్చాయి. ఈమె ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కావడంతో ఈమె ఒక హీరోయిన్ గా కన్ఫామ్ అయినట్లు భావించారు. కానీ అసలు ట్విస్ట్ ఏమిటి అంటే ఈమె ఈ సినిమాలో హీరోయిన్ గా కాకుండా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు ఈమె ధ్రువీకరించింది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇక కొన్ని రోజుల క్రితమే భగవంత్ కేసరి సినిమాలో ఈమె బాలయ్య కి జొడిగా నటించింది. ఆ వెంటనే ఈ బ్యూటీ మరోసారి బాలయ్య సరసన హీరోయిన్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అసలు విషయం ఏంటి అంటే ఈమె హీరోయిన్ పాత్ర కాకుండా కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు బ్యూటీలు ఉన్నా కానీ అందులో ఎవరు కూడా హీరోయిన్ కాదు అని తెలుస్తుంది. మరి ఈ మూవీ లో హీరోయిన్ లుగా ఎవరు నటిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: