శ్రీదేవి చనిపోయిన రోజు.. అసలేం జరిగిందో తెలిసిపోయింది...!

Chakravarthi Kalyan

అందాల నటి శ్రీదేవి ఆకస్మికంగా కనుమరుగై అప్పుడే వారం దాటుతోంది.. కానీ ఇంతకూ శ్రీదేవి ఎలా చనిపోయిందో ఎవరూ చెప్పడం లేదు. ప్రత్యక్ష సాక్షి బోనీ కపూర్ విషాదంతో నోరు విప్పడం లేదు.. ఇంకా దీని గురించి చెప్పేవారు కరవయ్యారు. కానీ ఇప్పుడు అసలు వాస్తవం బయటకు వచ్చింది.


ఇంతకీ ఆ రోజు శ్రీదేవి బస చేసిన హోటల్లో ఏం జరిగిందో బోనీకపూర్ స్నేహితుడు , సినీ జర్నలిస్ట్ కోమల్ నహతా బయటపెట్టారు. ఆయనకు బోనీ కపూర్ ఈ విషయాలు చెప్పారట.. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే.. దుబాయ్‌కి బోనీ, శ్రీదేవి ప్లాన్‌ చేసుకుని వెళ్లాలనుకోలేదట. మోహిత్‌ పెళ్లయ్యాక జాన్వి కు దుస్తులు కొనడానికి శ్రీదేవి కొన్ని రోజులు దుబాయ్‌లోనే ఉంటానందట.


బోనీకి లఖ్‌నవూలో పనుండి ఇండియా వచ్చేశాడట. ఫిబ్రవరి 24న ఉదయం శ్రీదేవి బోనీకి ఫోన్ చేసి చాలా మిస్సవుతున్నానని చెప్పిందట. దాంతో జాన్వీ తండ్రిని దుబాయ్ వెళ్లమని చెప్పిందట. శ్రీదేవి షాక్ ఇస్తూ సడన్ గా దుబాయ్ వెళ్లి ఆమె ముందు ప్రత్యక్ష మయ్యాడట.బోనీని చూసి శ్రీదేవి సంతోషంతో ఆలింగనం చేసుకుందట.


 అరగంట పాటు ఇద్దరం మాట్లాడుకుంటూ కూర్చున్నారట . తర్వాత శ్రీదేవి స్నానం చేసి వస్తానందట. కానీ ఎంతసేపటికీ గది నుంచి బయటికి రాలేదు. ఏం జరిగిందో చూద్దామని బోనీ గదిలోకి వెళ్లేసరికి నీరు నిండా ఉన్న బాత్‌టబ్‌లో మునిగిపోయి ఉందట. అదీ జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: