కత్తి మహేష్ ‘జై సింహ’ రివ్యూ దారుణం..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో కొంత కాలంగా పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు బెనిఫిట్ షో పడగానే వాటి రేటింగ్ ఇస్తూ సోషల్ మీడియాలో ఊదరగొడుతున్న విషయం తెలిసిందే.  ఇక టాలీవుడ్ లో సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ఈ రివ్యూల విషయంలో కాస్త కాంట్రవర్సీలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.  ఇక కత్తి ఇచ్చే రివ్యూ ఎలా ఉంటుందో అంటూ  సగటు ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురు చూస్తుంటారు.ఇదిలా ఉంటే బిగ్ బాస్ షో తర్వాత అంతంత మాత్రమే తెలిసిన కత్తి మహేష్ ఈ షో తర్వాత జనాలకు బాగా నోట్ అయ్యారు. 

ఇక నాలుగు నెలల నుంచి పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ తో కత్తి మహేష్ యుద్దం ఓ రేంజ్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో మొన్న పవన్ కళ్యాన్ నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రానికి కూడా ఘోరమైన రేటింగ్ ఇచ్చారు.  ఈ రోజు నందమూరి బాలకృష్ణ, నయనతార జంటగా నటించిన ‘జై సింహ’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. 

ఈ సినిమా బెనిఫిట్ షోలు పడ్డాయి..కాగా ఒక్కో సైట్ ఒక్కో రకంగా రేటింగ్ ఇవ్వగా.. కత్తి మహేష్ తన స్టైల్లో కామెంట్ చేశాడు. ‘‘80ల కథకి, 90ల కథనం. గతిలేని కథ. గమనం లేని కథనం. వెరసి ఒక కలగూరగంప సినిమా "జై సింహ". నిరర్ధకమైన కథలోని అసంబద్ధమైన పాత్రలో బాలయ్య. ఎందుకు ఉన్నామో తెలీని హీరోయిన్లు ముగ్గురు. అజ్ఞాతంలోకి మరో సంక్రాంతి సినిమా!’’ అంటూ కత్తి మహేష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.

నందమూరి బాలకృష్ణ హీరోగా.. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జై సింహా’.. సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. బాలయ్య- నయనతార కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమాగా వస్తున్న ‘జై సింహా’కు చిరంతన్ భట్ అందించిన సంగీతం ఇప్పటికే అభిమానులను అలరించింది. ఈ సినిమాలో హరి ప్రియ, నటాషా దోషి కూడా హీరోయిన్లుగా నటించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: