త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. దేవర సినిమాతో సినిమాతో క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాల తర్వాత మరికొన్ని సినిమాలకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు గోవాలో జరుపుకున్నారు. అయితే ఇప్పుడు థాయిలాండ్ కి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఇక దేవర షూటింగ్ కోసం థాయిలాండ్ కి వెళ్లిన
జూనియర్ ఎన్టీఆర్ కేవలం ఆయన ఒక్కడే కాకుండా తన కుటుంబాన్ని కూడా తీసుకువెళ్లాడు. భార్య లక్ష్మీ ప్రణతి కొడుకులతో థాయిలాండ్ కి వెళ్లారు. ఇక ఇవాళ ఎయిర్పోర్ట్ నుండి థాయిలాండ్ కి బయలుదేరారు ఎన్టీఆర్ కుటుంబం. దీంతో ప్రస్తుతం ఆ ఫోటోలో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే అలా ఈ ఫోటోలు కొన్ని బయటకు రాగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి మళ్ళీ ఫ్యామిలీ ట్రిప్ వేసాడు అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ అలా కాదు. ఈ ప్రయాణం షూటింగ్ లో
భాగమే అని తెలుస్తోంది. దేవర సాంగ్ షూట్ థాయిలాండ్లో జరుపుకుంటున్నట్లు గా సమాచారం వినబడుతోంది. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబాన్ని తీసుకొని థాయిలాండ్ వెళ్లారు. అయితే కేవలం సినిమానే కాకుండా థాయిలాండ్ లో చిన్నపాటి వెకేషన్ ఎంజాయ్ చేద్దాము అని జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబాన్ని తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. కాగా దేవర మూవీని ప్రీపోన్ చేస్తూ.. అక్టోబర్ నుంచి సెప్టెంబర్ కి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుంది. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడం, మూవీని కూడా కొరటాల శివ భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండడంతో.. ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి..!!