ఈ మద్య నెటిజన్లు ఎక్కువ శాతం టాప్ హీరోలు, హీరోయిన్లు, ప్రముఖ నేతల, క్రీడాకారులను ఎక్కువగా సర్చ్ చేస్తున్నారు. భారత దేశంలో ఆ మద్య ఎక్కువ నెటిజన్లు ప్రధాని మోడీ, సల్మాన్,షారూఖ్,కోహ్లీలను ఎక్కువ సర్చ్ చేస్తున్నట్లు తెలిసిందే..అయితే వీరితో పాటు హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే లను ధీటుగా సెక్సీ బ్యూటీ సన్నీలియోన్ నే ఎక్కువ సర్చ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
తాజాగా యాహూ తమ సెర్చ్ ఇంజిన్లో నెటిజన్లు అత్యధికంగా సెర్చ్ చేసిన వారి జాబితాను ఒక్కొక్కటిగా విడుదల చేయడం ప్రారంభించింది. ఈ ఏడాది యాహూలో అధికంగా సెర్చ్ చేసిన భారత సినిమా హీరోయిన్లలో మొదటి స్థానంలో మళ్లీ సన్నీలియోన్ నిలిచింది. హాలీవుడ్ లో ఫోర్న్ చిత్రాల్లో నటించి దర్శకత్వం వహించిన సన్నలియోన్ వాటికి గుడ్ బాయ్ చెప్పి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
కేవలం బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఐటమ్ సాంగ్స్ లో నటిస్తూ కవ్విస్తుంది. ఇక నటుల విషయానికి వస్తే ఈ ఏడాది మృతి చెందిన వినోద్ ఖన్నా మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన మృతి చెందిన సమయంలో వివరాలు తెలుసుకునేందుకు అధికమంది యాహూలో శోధించారు. రెండో స్థానంలో కపిల్ శర్మ ఉన్నారు.