మూవీ మేకర్ గా మారనున్న సీనియర్ సౌత్ హీరోయిన్

"ముదితల్ నేర్వగ లేని (రాని) విద్య గలదే ముద్దార నేర్పించినన్" అనే సామెత సత్యభామ కాలం నుంచి ఉంది. అయితే అక్కడ అప్పటి పరిస్థితుల్లో నేర్చుకునే ఉత్సాహం ఉన్నవారికే నేర్పించేవాళ్ళు. కాని ఇప్పుడు ఎవరూ నేర్పక్కర్లేదు. చూసి నేర్చేసు కుంటున్నారు. అమెరికా లాంటి దేశాల్లో మహిళలు సైన్యంలో చేరి సరిహద్దు రక్షణ బాధ్యత లు నిర్వహిస్తున్నారు. ఏ రంగాన్ని అమ్మాయిలు వదిలిపెట్టడం లేదు అకాశమే హద్దుగా కొనసాగుతున్నారు. 


అయితే ఈ మధ్య కాలంలో హీరోయిన్లు తమకు అంతగా కుదరని క్రిటికల్ విభాగమైన ఫిల్మ్ ప్రొడక్షన్ రంగంలోకి కూడా ప్రవేసిస్తున్నారు అంటే నిర్మాతలుగా అవతారం ఎత్తుతున్నారు. బాలీవుడ్ లో అనుష్కా శర్మ, ప్రియాంక చోప్రా, వంటి వాళ్లు పెట్టుబడులు పెట్టి సినిమాలు రూపొందించి మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నారు కూడా! 



ఇక టాలీవుడ్ తో కూడిన దక్షిణ భారత సినీ రంగాం లో కూడా గతంలో నిర్మాణ రంగంలో ప్రవేసించిన భూమిక వంటి వాళ్లు నిర్మాతలుగా సినిమాలు నిర్మించినా వైఫల్యం రుచి చూశారు. ఇప్పుడు మరి కొంత మంది హీరోయిన్లు నిర్మాతలు గా మారే అవకాశం కనిపిస్తుంది అందులో చెప్పుకోవలసింది అక్కినేని ఇంటి కొత్త కోడలు సమంతకు సినిమా నిర్మాణం అత్యత సులభం. స్వంత స్టూడియో, నిర్మాణ సంస్థలు మందీ మార్బలం వడ్డించిన విస్తరిలా సిద్ధం గా ఉండటంతో నిర్మాతగా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆమె సంగతలా ఉంచితే.....



అసలు వార్త ఇప్పుడు సీనియర్ సదరన్ యాక్ట్రెస్ త్రిష నిర్మాతగా మారబోతోంది. దాదాపు ఒకటిన్నర దశాబ్ధం పాటు హీరోయిన్ గా త్రిష ప్రస్థానం ఏమిటో మనకందరకు తెలిసిందే.  దాదాపు పదిహేను సంవత్సరాలుగా ఈమె దక్షిణ భారత చిత్ర రంగం లో తన అప్రతిహత కెరీర్ ను కొనసాగిస్తోంది.


అందాల భామ త్రిషకు ఇప్పటికీ తమిళ, తెలుగు భాషల్లో ఆమెకు అవకాశాలు పొంగిపొరలుతూనే ఉన్నాయి. అనుభవం, ఆర్ధిక మూలాలు బలంగా ఉండటంతో పెట్టుబడి సునాయాసమే కదా! అందుకే నిర్మాతగా నిర్మాణ రంగంలోకి రావాలని చూస్తోందట. ప్రస్తుతం త్రిష కథల వేటలో ఉందట. మంచి కథ లభిస్తే నిర్మాతగా రంగ ప్రవేశానికి సిద్ధమే నట. తనే నిర్మాతగా మారి సినిమాను రూపొందించాలని ఆమె ఫిక్సయ్యిందని సమాచారం. మరి హీరోయిన్ గా మంచి విజయాలు స్వంతం చేసుకున్న త్రిష, "మూవీ మేకర్" గా కూడా రాణించాలని ఆశిద్ధాం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: