కిస్ అంటే ముద్దు కాదు - దానికి ఉంది ఎబ్రివేషన్

K Prakesh

 పవన్ కళ్యాణ్ పంజాసినిమా విల‌న్ ఇప్పుడు హీరో అయ్యాడు. ‘కిస్’ అనే సినిమాతో రొమాన్స్  చేయ బోతున్నాడు  అతడే  అడ‌వి శేషు .అతడు  న‌టించిన చిత్రం ‘కిస్‌’. ప్రియా క‌థానాయిక‌. ఈ సినిమాకు అతడే దర్శకుడు  ‘కిస్’ టైటిల్ సాంగ్ ఆవిష్కర‌ణ కార్యక్రమం హైద‌రాబాద్‌ లోని ప్రసాద్ ల్యాబ్స్‌ లో జ‌రిగింది. జూన్ మొద‌టి వారంలో పాటల్ని విడుద‌ల చేస్తామని చెప్పారు. ఈ సంద‌ర్భంగా అడ‌వి శేష్ ఈ సినిమా గురించి చెబుతూ ”ఈ సినిమాకి ‘కిస్’ అనే పేరు పెట్టడం వెనుక చాలా కార‌ణాలున్నాయి.

అది హీరో యాటిట్యుడు కి సంబంధించిన అంశం. కిస్ అంటే ముద్దు కాదు. దానికో ఎబ్రివేష‌న్ ఉంది. కీప్ ఇట్ సింపుల్ స్టుపెడ్‌. దానితో పాటు ఈ సినిమాలో ముద్దుకీ ప్రాధాన్యం ఉంది. కిస్ అనే పేరు పెట్టామ‌ని.. సినిమా అంతా ముద్దులే ఉంటాయ‌నుకోవ‌ద్దు. క‌థానాయిక త‌న తొలి ముద్దు గురించి ఎదురుచూస్తుంటుంది. మేమిద్దరం ఒకే ఒక్క ముద్దు పెట్టుకొన్నాం..” అని చెప్పుకొచ్చాడు. మంచి నటుడిగా పేరున్న శేషు ముద్దు పై తనకున్న భావాలను వెండితెర పై చూపించగలిగితే ఈ సినిమా మరొక ట్రెండ్ సెటర్ అయినా ఆశ్చర్య పోనక్కరలేదు....

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: