హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పై ఒక ప్రముఖ మీడియా సంస్థ చేయించిన సర్వేలో అనేక ఆశక్తికర విషయాలు బయటకు వచ్చి నట్లుగా తెలుస్తోంది. ‘ప్రస్తుత సినిమాలలో హాస్యం’ అనే విషయం పై జరిగిన ఈసర్వే లో అనేక విషయాలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ సర్వే వివరాల ప్రకారం తెలుగు సినిమారంగంలో నవ్వించడానికి ఎంతోమంది కమెడియన్స్ ఉన్నా నవ్వించడంలో బ్రహ్మానందం స్థానం ఎవరు పూడ్చాలేరని ఆ సర్వే ఫలితాలు తేల్చి నట్లు టాక్.
అంతేకాదు బ్రహ్మానందం పని అయిపోయిందనీ ఆయన కామెడీకి నవ్వు రావడంలేదనీ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఆ సర్వేలో పాల్గొన్న చాలా మంది అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది. దీనికి కారణం బ్రహ్మానందం కామెడీకి సంబంధించిన వీడియోలు యూట్యూబ్ లో చూస్తున్నవారు ఇంకా అధిక సంఖ్యలో ఉన్నట్లు ఆసర్వే తెలియ చేస్తోంది అని అంటున్నారు.
ఇక కొంత మంది టాలీవుడ్ నిర్మాతలు అయితే బ్రహ్మానందాన్ని పెట్టుకోలేని కొంతమంది నిర్మాతలు అలా అసత్య ప్రచారం చేసి ‘జబర్దస్త్’ గ్యాంగ్ ని ప్రోత్సహిస్తున్నారే తప్ప బ్రహ్మానందం కామెడీకి సరితూగ గలవారు ఇప్పటికి కూడ టాలీవుడ్ లో లేరు అని కామెంట్ చేసినాట్లు తెలుస్తోంది. 30 సంవత్సరాల ఇండస్ట్రీ అంటూ వచ్చిన పృధ్వీరాజ్ ఎప్పటికీ బ్రహ్మికి ప్రత్యామ్నాయం కాలేడని ఇండస్ట్రీ వాళ్ళే అంతర్గతంగా ఒప్పుకుంటున్నారు అనే విషయాన్ని కూడ ఈసర్వే బయట పెట్టిందట.
బ్రహ్మీతో చెత్త కామెడీ చేయించి దర్శక నిర్మాతలు బోర్ కొట్టించేస్తున్నారుగానీ సరిగ్గా వాడుకుంటే బ్రహ్మానందం తర్వాతే ఎవరైనా అని ఈ సర్వేలో పాల్గొన్న అనేకమంది కామెంట్ చేసారు అని వార్తలు వస్తూ ఉండటంతో ఈ వార్తలు అనీ బ్రహ్మికి జోష్ ను కలిగిస్తాయి అనుకోవాలి..