పవన్ కు షాక్ ఇచ్చిన వెంకీ !

Seetha Sailaja


‘గోపాల గోపాల’ సినిమా తరువాత ఎందరో దర్శకులు కధలు వినిపిస్తున్నా తీరికగా ఆకధలు అన్నీ వెంకటేష్ వింటున్నాడు, కానీ తనకు ఎటువంటి కదా నచ్చుతుందో తెలియక ఒక విధమైన అయోమయంలో వెంకటేష్ రోజులు గడుపుతున్నాడు. ఈ పరిస్థితులలో వెంకీని సక్సెస్ ఫుల్ రచయితగా పేరు  తెచ్చుకున్న వక్కంతం వంశీ బుట్టలో పడేసాడు అనే వార్తలు విని పిస్తున్నాయి. 

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం వంశీ  వెంకటేష్ కోసం ఓ యాక్షన్ స్టోరీని రెడీ చేసాడని టాక్. ఈ కధలో చాలా రోజుల తరువాత వెంకటేష్  ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడట.  అయితే ఈ సినిమాను పవన్ వెంకటేష్ లతో ‘గోపాల గోపాల’ తీసిన కిషోర్ కుమార్ పార్థసాని డైరెక్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 

అయితే టాలీవుడ్ లో డాలీ గా పేరుగాంచిన ఈ డైరెక్టర్ పవన్  దాసరి ల సినిమాకు దర్శకత్వం వహించాలని ఎదురు చూస్తూ ఉంటే అనుకోకుండా ఇప్పుడు వెంకటేష్ నుండి పిలుపు రావడం ఈ దర్శకుడికి షాక్ ఇచ్చింది అని వార్తలు వస్తున్నాయి . ‘గోపాల గోపాల’ ఆడియో వేడుకలో పవన్ డాలీకి తనతో సినిమా చేయడానికి మరో అవకాశం ఇస్తానని బహిరంగంగా ప్రకటించాడు. 

దీనితో డాలీ పవన్ పిలుపు కోసం ఎదురు చూస్తున్న నేపధ్యంలో ఇప్పడు వెంకటేష్ నుండి పిలుపు డాలీకి రావడంలో ఈ దర్శకుడు మంచి జోష్ లో ఉన్నట్లు టాక్. 2004లో వచ్చిన ‘ఘర్షణ’ దాదాపు పదేళ్ల తర్వాత విక్టరీ వెంకటేష్ మళ్లీ పోలీసు గెటప్‌లోకనిపించడానికి ఈసినిమా ద్వారా ప్రయత్నిస్తున్నాడు. ఏది ఏమైనా వెంకటేష్ నిర్ణయం పవన్ కు  గట్టి షాక్ ఇస్తుంది అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: