మనీ: రూల్ ప్రకారం ఇంట్లో ఎంత డబ్బు ఉంచుకోవచ్చో తెలుసా..?

Divya
ప్రస్తుతం దేశమంతటా కూడా ఎక్కువగా డిజిటల్ లావాదేవీలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో ప్రజలు ఇంట్లో నగదును అసలు ఉంచుకోవడానికి ఇష్టపడడం లేదు.. కానీ ఎమర్జెన్సీ వస్తే మాత్రం హఠాత్తుగా నగదు అవసరం పడుతుంది.. అత్యవసర పరిస్థితులలోనే డబ్బులు ఉంచడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. అయితే ఇంట్లో ఎంతవరకు నగదు ఉండవచ్చు అనే విషయం మాత్రం ఎవరికీ తెలియకపోవచ్చు. పరిమితి కంటే ఎక్కువ డబ్బు ఉంటే ఏమవుతుంది.. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంట్లో నగదు ఉంచడానికి ఎటువంటి పరిమితులు ఉండవు.. అయితే మీ వద్ద అందుబాటులో ఉన్న నగదుకు సంబంధించిన అన్ని ఆధారాలను కలిగి ఉండాలి... ఆ డబ్బు మీకు ఎక్కడి నుండి వచ్చింది దాని ఆదాయం ఏమిటి వాటి రుజువులను చూపించాలి.. అధిక మొత్తంలో డబ్బు ఉంటే దానిపైన పళ్ళు చెల్లించాలి అందుకు సంబంధించిన పత్రాలను కూడా కలిగి ఉండాలి.. ఇంట్లో నగదు ఉంచుకోవడానికి ఇ నియమాలను పాటించాల్సి ఉంటుంది.

ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీల పైన జరిమానా విధిస్తారు..
CBDT ప్రకారం ఒకసారి 50వేల కంటే ఎక్కువ రూపాయలను డిపాజిట్ చేసిన విత్డ్రా చేసిన పాన్ కార్డు నెంబర్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది.
ఒక సంవత్సరంలో 20 లక్షల నగదు డిపాజిట్ చేసిన కచ్చితంగా ఆధార్ పాన్ కార్డుని అందించాలి. ఒకవేళ ఈ వివరాలు అందించడంలో ఫెయిల్యూర్ అయితే 20 లక్షల వరకు జరిమానా విధిస్తారట.
30 లక్షల కంటే ఎక్కువ నగదు ఆస్తులను కొనుగోలు చేస్తే ఎవరైనా సరే దర్యాప్తు కిందికి రావచ్చు..
ఎవరైనా సరే ఒక్కరోజులో 2 లక్షలకు మించి నగదు తీసుకోలేరు. దీన్ని బట్టి చూస్తే.. ఇంట్లో ఎంత డబ్బైనా ఉండవచ్చు అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను కలిగి ఉంటే ఇన్కమ్ టాక్స్ దాడులు చేసిన భయపడాల్సిన పని ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: