మనీ: ఉచితంగా మీ సిబిల్ స్కోర్ ఇలా చెక్ చేసుకోండి..!!

Divya
మనకు ఏదైనా బ్యాంకు రుణం ఇవ్వాలి అంటే కచ్చితంగా మంచి సిబిల్ స్కోర్ ఉండాలని విషయం తెలిసిందే ..అయితే ఈ సిబిల్ స్కోర్ ఆధారంగానే మనకు బ్యాంకుల సైతం రుణాలు చెల్లిస్తాయి.. అలాగే కొన్ని ఇతరత్రా ఫైనాన్స్ సంస్థలు కూడా ఈ సివిల్ స్కోర్ ఆధారంగానే మనకి తగిన వడ్డీ రేటును కూడా లెక్కగడుతూ ఉంటాయి. ఈ సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉన్న వారికి తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తూ ఉంటుంది. అలాగే రుణ పరిమితి కూడా ఎక్కువగా పెంచుతాయి పలు రకాల బ్యాంకులు..
చాలామంది సైతం తెలిసో తెలియక చేసేటువంటి కొన్ని పొరపాట్లు కారణంగా ఈ సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది.. ముఖ్యంగా EMI లను కరెక్ట్ గా చెల్లించకపోవడం క్రెడిట్ కార్డు బిల్లులు పెండింగ్ ఉండడం వంటి వాటి వల్ల ఈ సివిల్ స్కోర్ ఒక్కసారిగా డౌన్ అవుతుంది. వీటితో పాటు భవిష్యత్తులో రుణాలను పొందడం కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది. దీనివల్ల సాధారణంగా 750 పాయింట్లు పైగా స్కోరు ఉంటేనే అది బెస్ట్ సిబిల్ స్కోర్ లోకి పరిగణంలోకి తీసుకుంటారు. మరి మీ సిబిల్ స్కోర్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఇలా చేయండి.
మీ సిబిల్ స్కోర్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పాన్ కార్డు ఉండాల్సిందే.. పాన్ ఆధారంగానే ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని కూడా తెలుసుకోవచ్చు.. సివిల్. COM అనే వెబ్సైట్ ద్వారా సిబిల్ స్కోర్ ను తెలుసుకోవచ్చు..
1).ముందుగా హోమ్ పేజీలో కనిపించే గెట్ ఫ్రీ సిబిల్ స్కోర్ అండ్ రిపోర్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది.
2). అక్కడ ఈమెయిల్ అడ్రస్ పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ , పాన్ కార్డు నంబర్ వంటివి ఎంటర్ చేయాలి.. అలా అన్ని వివరాలను ఎంటర్ చేసిన తర్వాతే ఈ పూర్తి సిబిల్ స్కోర్ మీ మెయిల్ ఐడి కి ఒక డాక్యుమెంట్ రూపంలో వస్తుంది.
 ఈ సిబిల్ స్కోర్ తో పాటు మీకు ఎన్ని EMI లు ఉన్నాయో EMI లు సరిగ్గా చెల్లిస్తున్నారా లేదా వంటివి వివరాలను కూడా అందుబాటులో ఉంచుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: