మనీ: వృద్ధులకు శుభవార్త తెలిపిన ఏపీ ప్రభుత్వం..!

Divya
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వృద్ధులను దృష్టిలో పెట్టుకొని 2000 ఇవ్వబడుతున్న పెన్షన్ ను , ప్రస్తుతం మూడు వేల రూపాయలకు పెంచారు. ఎవరి తోడు నీడ లేకుండా ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులకు వైయస్ జగన్ అందిస్తున్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. అంతేకాదు వైఎస్సార్ పెన్షన్ కానుక కింద సరికొత్త గైడ్లైన్స్ ను కూడా తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం.
ఇప్పటికే చాలా మంది వృద్ధులు, 60 సంవత్సరాల వయసు పైబడినవారు, వికలాంగులు,  వితంతువులు ఇలా  చాలామంది పెన్షన్లు అందుకోవడంలో పలువురు లబ్దిదారులు పోర్టబులిటీ లేని కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇక అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం.. ఇక రాష్ట్రంలో ఎక్కడైనా పెన్షన్  దారులు ఎవరైనా  పెన్షన్ తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం..

రాష్ట్రంలో ఎక్కడైనా సరే  6 నెలలు కంటే ఎక్కువ సమయం వేరే ప్రాంతాలకు వెళ్లి  నివసిస్తున్న వారికి.. వారి సొంత గ్రామాలలో కాకుండా, వారు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడే  వారున్న చోటే..ఈ పెన్షన్ తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక పెన్షన్ లబ్దిదారులు ఉంటున్న ప్రాంతానికి  సమీపం లో వున్న సచివాలయానికి, వాలంటీర్‌కు మ్యాప్ చేయాలంటూ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.. ఇలా చేయడం వల్ల చాలామంది వృద్ధులు ఎక్కడెక్కడ నివసిస్తూ.. పెన్షన్ కోసం తమ స్వగ్రామాలకు రావాల్సిన పని లేకుండా, ఎక్కడ ఉంటే అక్కడే తమకు రావాల్సిన పెన్షన్ సంతోషం గా తీసుకోవచ్చు అని , పెన్షన్ లబ్దిదారులకు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ విషయం తెలుసుకున్న ఎంతో మంది వృద్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ఇకపై అత్యధిక చార్జీలను పెట్టుకొని స్వగ్రామాలకు వెళ్లి, పెన్షన్ తెచ్చుకుంటున్న ఎంతోమంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకుండా  పెన్షన్ తీసుకోవచ్చని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: