చెల్లి పెళ్లి కోసం హోటల్ కే కోట్లను గుమ్మరిస్తున్న అన్న !

Seetha Sailaja
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ ప్రేమ వివాహం చేసుకోబోతోతున్న విషయం గతంలోనే మీడియాలో వచ్చింది. ఢిల్లీకి చెందిన ఆయుష్ శర్మతో అర్పిత ఖాన్ గత కొంత కాలంగా ప్రేమవ్యహారం నడుపుతోంది అని బాలీవుడ్ మీడియా అనేక సార్లు వార్తలు వ్రాసింది.  చివరకు వీరిద్దరి ప్రేమను సల్మాన్ అంగీకరించడంతో ఇరు కుటుంబాల సభ్యుల అంగీకారంతో సల్మాన్ సోదరి వివాహం అత్యంత వైభవంగా భాగ్యనగరములోని చారిత్రాత్మక ఫలక్‌నుమ ప్యాలెస్‌లో జరుగబోతోంది. రెండు రోజుల పాటు అత్యంత ఘనంగా జరిగే ఈ వివాహ వేడుకలకు సల్మాన్ ఏకంగా ఈ ఫలక్ నుమ ఎంటైర్ హోటల్ ను సల్మాన్ బుక్ చేయడమే కాకుండా కేవలం హోటల్ యాజమాన్యానికి అతిధుల విడిది నిమిత్తం 2 కోట్లు చెల్లిస్తున్నట్లు వస్తున్న సమాచారం. మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.  నవంబర్ 18వ తేదీన జరగబోయే ఈ వివాహ వేడుకకు అత్యంత ఘనమైన ఏర్పాట్లు చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా పేరుగాంచిన 250 మంది సెలెబ్రెటీలను ఘనంగా స్వాగతించడానికి సల్మాన్ చాల పెద్ద ఏర్పాట్లు చేస్తున్నాడని టాక్. హిందూ, ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరగబోతూ ఉండటంతో ఈ పెళ్ళికి సంబంధించిన వార్తలతో మీడియా హోరెత్తి పోతోంది.   ఈ వివాహ ఏర్పాట్లలో సల్మాన్ సన్నిహితులు విక్టరీ వెంకటేష్ మరియు సురేష్ బాబులు ప్రతి వ్యవహారాన్ని దగ్గర ఉంది చూసుకుంటూ తమ ప్రియ మిత్రుడు సల్మాన్ కు సహకారం అందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: