అఫీషియల్ : ఆర్సి15 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ విడుదల టైమ్ ను ప్రకటించిన చిత్ర బృందం..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ గా తన క్రేజ్ ను పెంచుకున్నాడు. ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అత్యంత భారీ క్రేజ్ ను సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రముఖ నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ జై సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించనుండగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది శ్రీకాంత్ , సునీల్ , అంజలి ముఖ్య పాత్రాలలో కనిపించనున్న ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ కి ఈ సినిమా బృందం ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా యొక్క చిత్రీకరణ ఆర్ సి15 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈ రోజు ఈ మూవీ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

ఆర్ సి 15 యొక్క టైటిల్ మరియు ఫస్ట్ పోస్టర్ ను ఈ రోజు ఉదయం 8 గంటల 19 నిమిషాలకు మరియు మధ్యాహ్నం 3 గంటల 06 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మూవీ యొక్క టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: