1వరోజు అత్యధిక కలెక్షన్లను సాధించిన టాప్ 5 మీడియం రేంజ్ తెలుగు మూవీలు ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎం తోమంది మీడియం రేంజ్ హీరోలు ఉన్నారు. అలాగే వారి సినిమాలకు కూడా అంచనాలు ప్రేక్షకుల్లో బాగా ఏర్పడిన సందర్భంలో స్టార్ హీరోల రేంజ్ లో కలెక్షన్ లు వస్తూ ఉంటాయి. అలా మీడియం రేంజ్ హీరోలు నటించిన మూవీ లలో మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్ లను సాధించిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.
లైగర్ : విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లైజర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఎఫ్ 3 : విక్టరీ వెంకటేష్ ... వరుణ్ తేజ్ హీరోలుగా మిల్కీ బ్యూటీ తమన్నా ... మెహరీన్ హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్ 3 మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
బంగార్రాజు : టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా రమ్య కృష్ణ హీరోయిన్ గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన బంగార్రాజు మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ సినిమాలో నాగ చైతన్య కీలక పాత్రలో నటించగా ... నాగ చైతన్య కు జోడిగా ఈ సినిమాలో కృతి శెట్టి నటించింది.
లవ్ స్టోరీ : నాగ చైతన్య హీరో గా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఉప్పెన : పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 16 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: