విజయ్ దేవరకొండ మూవీ ఆగడానికి కారణం...!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అతి తక్కువ సినిమాలతోనే రౌడీ బాయ్ గా పేరు సంపాదించినా స్టార్ హీరో విజయ్ దేవరకొండ. ఐతే ప్రెసెంట్ ఆయన కెరియర్ మాత్రం ఒక అడుగు ముందుకు పది అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. ఆయన అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో సక్సెస్ అయ్యాను అనుకుంటున్నా టైములో వరుసగా ఫెయిల్యూర్స్ ఆయన ఇంటి తలుపు తట్టాయి.
ఐనా కూడా ఆయనకు మంచి ఛాన్సెస్ దక్కాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కానీ అలా వచ్చిన అవకాశాలు కూడా విజయ్ దేవరకొండ కు నిరాశ మిగిల్చాయి. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో రూపొందిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత వెంటనే శివ నిర్వాణ డైరెక్షన్లో ఖుషి సినిమా తో విజయ్ దేవరకొండ అభిమానుల  ముందుకు రావాల్సి ఉంది. కానీ సమంత అనారోగ్య కారణాల వల్ల ఆ సినిమా ఇప్పటి వరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు, కనీసం షూటింగ్ కూడా పూర్తి చేసు కోలేదు. ఐతే ఈ నెలలో సమంత షూటింగ్ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వస్తాను అని చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఐతే ఇదిలా ఉంటే మరో వైపు పరశురామ్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాణం లో ఒక సినిమా ను అధికారికంగా ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఆ మూవీ కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేదు ఇంకనూ రాలేదు. దీనికి కారణం అల్లు అరవింద్ మరియు పరశురాం మధ్య ఉన్న గొడవ అని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. కనుక దిల్ రాజు సినిమా కూడా క్యాన్సిల్ అవడంతో వెంటనే సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం లో విజయ్ దేవరకొండ కొత్త సినిమా ను చేసేందుకు అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తుంది. ఐతే ఈ సినిమా కు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అయితే డైరెక్టర్ ఎవరు అనే విషయం లో మాత్రం ఇప్పటి వరకు సస్పెన్స్ కొనసాగుతోంది.ఐతే రాబోయే రెండు నెలల్లోనే సినిమా కు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించి రెగ్యులర్ షూటింగ్ కి కూడా వెళ్లే ఆలోచనలో విజయ్ దేవరకొండ ఉన్నాడని తెలుస్తోంది.ఐతే ఇటీవల పరిశీలిస్తే సితార ఎంటర్టైన్మెంట్స్ వారి పతాకం లో వచ్చిన సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.కనుక విజయ్ దేవరకొండకు మరల ఇంకో విజయం కచ్చితంగా వస్తుందని ఆయన అభిమానులు ఆశ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: