ఆ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ ఎమోషనల్ అయిన జాన్వీ కపూర్..!?

Anilkumar
అలనాటి తార శ్రీదేవి వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. చాలా తక్కువ సమయంలోనే బాలీవుడ్ హాట్ ఫేవరెట్ హీరోయిన్ల లిస్టు లోకి కూడా చేరిపోయింది ఈమె. ప్రస్తుతం  ఒకవైపు సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూనే మరో పక్క తనకి సంబంధించిన హాట్ హాట్ ఫోటో షూట్లను చేస్తూ సోషల్ మీడియా వేదికగా వాటిని షేర్ చేస్తూ చాలామంది అభిమానులను దక్కించుకుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత జీవితానికి మరియు తన సినిమాలకు సంబంధించిన అప్డేట్లను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది జాన్వి కపూర్.

శ్రీదేవి వారసు రాలిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తరచూ విమర్శలు మరియు ట్రోల్స్ కు గురవుతూ ఉంటుంది ఈమె. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా తనపై వచ్చే విమర్శలకి గాను మండిపడింది ఈమె. తనపై వచ్చే ట్రోల్స్ చూసి ఆమె విసిగిపోయినట్లుగా ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. అంతేకాదు ఎంతో కష్టపడినప్పటికీ ఏదో ఒక తప్పు చూపిస్తూ ఎప్పటికప్పుడు నన్ను ట్రోల్స్ చేస్తున్నారు అంటూ వాపోతోంది. అంతేకాదు ఇందులో భాగంగానే మాట్లాడుతూ మనం ఏం చేసినా ఎంత కష్టపడినా కొందరు అందులో కచ్చితంగా తప్పులు వెతుకుతూ ఉంటారు.  ఎప్పటికప్పుడు సూటిపోటి మాటలతో బాధపడుతూ ఉంటారు అంటూ తనపై వస్తున్న ట్రూల్స్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది జాన్వి కపూర్. మనల్ని ట్రోల్స్ చేసి వారు ఆనందపడుతూ ఉంటారు అంటూ చెప్పుకొచ్చింది.

మనపై ట్రోల్స్ చేసి వారు గుర్తింపు పొందాలని చూస్తూ ఉంటారు. ఇది నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది. తరచూ ఇలాంటి వార్తలు వస్తే ప్రజలు ఈ వార్తలను చదివి చదివి అలసిపోతూ ఉంటారని.అంతే కాదు తాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటినుండి ఇలాంటి విమర్శలను  ఎదుర్కొంటున్నానని చెప్పుకొచ్చింది ఈమె. అంతేకాదు తనకి సంబంధించిన సినిమాలు రిలీజ్ అయిన ప్రతిసారి నటించడం రానప్పుడు ఎందుకు సినిమాల్లో నటిస్తున్నావు అంటూ పిచ్చిగా కామెంట్లు చేయడంతో ఆ సమయంలో తాను చాలా ఆవేదనకు గురైనట్లుగా కూడా ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ట్రోలింగ్ను పెద్దగా పట్టించుకోవడంలేదని సోషల్ మీడియాలో తనపై వచ్చే ప్రతి ట్రోల్స్ ని కూడా ప్రస్తుతం తాను ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది జాన్వి కపూర్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: