బిగ్ బాస్ ఇనాయకు.. బంపర్ ఆఫర్?

praveen
ఇనయ సుల్తానా.. ఈ పేరుకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. గతంలో సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో రాసుకొని పూసుకొని తిరిగి వార్తల్లో తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది ఈ అమ్మాయి. ఒక లేడీ ఆర్జీవి లాగా ప్రవర్తిస్తుంది అని ఎంతో మంది సోషల్ మీడియాలో చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇక ఇలా ఆర్జీవితో చాలా క్లోజ్ గా ఉంటూ ఆర్జీవి అలవాట్లనే తన అలవాట్లుగా మార్చుకున్న ఇనాయ సుల్తానా ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించింది అని చెప్పాలి. ఇక మొన్నటికి మొన్న బిగ్ బాస్ హౌస్ లోకి కంటస్టెంట్గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మరింత సుపరిచితురాలుగా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 మొదటినుంచి తనదైన శైలిలో గేమ్ ఆడుతూ వచ్చిన ఇనయ సుల్తానా ఇక బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కూడా పేరు సంపాదించుకుంది. ఇక వినయ గేమ్ స్ట్రాటజీ చూసిన తర్వాత ఆమె టాప్ ఫైవ్ లో ఉండడం ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో మధ్యలోనే ఇనయా ఎలిమినేట్ కావడం మాత్రం బిగ్ బాస్ ప్రేక్షకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. హౌస్ నుంచి బయటికి వచ్చాక వరుస ఆఫర్లతో బిజీ బిజీగా మారిన ఈ అమ్మడు ఇక ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది అన్నది తెలుస్తుంది.

 ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో టాప్ నిర్మాణ సంస్థగా కొనసాగుతున్న ఒక భారీ సంస్థకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. అయితే అంత పెద్ద నిర్మాణ సంస్థ ఇనాయకు పిలిచి మరి అవకాశం ఇవ్వడానికి వెనక కారణం ఆమె బోల్డ్ సీన్స్ చేయడంలో వెనకడుగు వేయదు అని ఒకే ఒక్క కారణమట. ఏకంగా తమ సినిమాలో సెకండ్ హీరోయిన్ టైపు క్యారెక్టర్ కు ఆఫర్ ఇచ్చారట. ఇక సినిమాలో బోల్డ్ నెస్ తో ఇనాయ పిచ్చిపిచ్చిగా రెచ్చిపోవాల్సి ఉంటుందట. అయితే పెద్ద నిర్మాణ సంస్థ కావడంతో అటు మంచి ఆఫర్ కోసం ఎదురుచూస్తున్న ఇనయా సుల్తానా కూడా నో చెప్పడానికి వెనకాడదు అని ప్రస్తుతంఅందరూ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: