అన్ స్టాపబుల్ 2 : ప్రభాస్... గోపీచంద్ ఎపిసోడ్ షూటింగ్ అప్పుడే..!

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస మూవీ లతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆది పురుష్ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్న ప్రభాస్ ప్రస్తుతం సలార్ , ప్రాజెక్ట్ కే ,  మారుతీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఓ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇలా వరుస మూవీ లతో ఫుల్ బిజీ గా ఉన్న ప్రభాస్ అంట్ స్టాపబుల్ సీజన్ 2 టాక్ షో కు ముఖ్య అతిథి గా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రభాస్ తో పాటు టాలీవుడ్ మాస్ హీరోలలో ఒకరు అయినటు వంటి గోపీచంద్ కూడా ఈ ఎపిసోడ్ కు ముఖ్య అతిథి గా రాబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ కి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ ను రేపు అనగా డిసెంబర్ 11 వ తేదీన ఆహా యూనిట్ చిత్రీకరించ బోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే గోపీచంద్ తాజాగా పక్క కమర్షియల్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. అయినప్పటికీ ఈ మూవీ లో గోపీచంద్ తన స్టైలిష్ లుక్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. మారుతి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో గోపీచంద్ సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కు బాలకృష్ణ పోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఈ టాక్ షో లో కొన్ని ఎపిసోడ్ లు పూర్తి అయ్యాయి. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: