విడాకుల విషయంపై క్లారిటీ ఇచ్చిన శ్రీకాంత్..ఏమన్నారంటే..!?

Anilkumar
ఇప్పుడు చాలామంది సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని చాలా రోజులు అవుతున్నప్పటికీ ఏవో మనస్పర్ధల కారణంగా విడాకుల బాట పడుతున్నారు.అంతేకాదు ఇంకొంతమందేమో భాగస్వామ్యుల గురించి ఏమీ తెలియకుండా పెళ్లిళ్లు చేసుకుని వారి మధ్య అభిప్రాయాలు కుదరక తొందరనే బ్రేకప్ అంటూ విడిపోతున్నారు. అయితే  ఇక ఇటీవల కాలంలో చాలా మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు.ఇకపోతే  ఇందులో చాలామందికి ఫేవరెట్ జంట అయినా సమంత-నాగచైతన్య, కోలీవుడ్ హీరో ధనుష్-ఐశ్వర్య ఇలా వీళ్లు విడాకులు తీసుకొని అందర్నీ బాధపెట్టారు.

కొంతమంది నెటిజెన్స్ మాత్రం సెలబ్రెటీలు విడాకులు తీసుకుపోయిన ఏదో ఒక రూమర్ క్రియేట్ చేసి వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారు అంటూ ప్రచారం చేస్తారు. ఈ మధ్యనే హీరో నిఖిల్ గురించి విడాకులు తీసుకుంటున్నాడు అంటూ రూమర్స్ క్రియేట్ చేశారు. ఇక తన విడాకుల వార్తలపై స్పందిస్తూ వాళ్లు కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసి గట్టి కౌంటర్ ఇచ్చారు.అంతేకాదు  అలాగే తాజాగా శ్రీకాంత్ తన భార్య ఊహకు కూడా విడాకులు ఇస్తున్నాడు అంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.  విషయంలోకి వెళ్తే.. హీరో శ్రీకాంత్ మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా,

ఆ తర్వాత హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకను క్రియేట్ చేసుకున్నారు.అయితే శ్రీకాంత్ ఇప్పటికే దాదాపు 125 పైగా సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.ఇక  శ్రీకాంత్ అప్పట్లో తన తోటి నటి అయిన ఊహను ప్రేమించి ఇంట్లో వాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా జన్మించారు.  శ్రీకాంత్ పెద్ద కొడుకు రోషన్ కూడా నిర్మల కాన్వెంట్ అనే సినిమాతో హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు అలాగే ఈ మధ్యనే రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందD అనే మూవీలో కూడా నటించారు.  ఈ విషయం పక్కన పెడితే కొన్ని రోజుల నుండి శ్రీకాంత్ ఊహ మధ్య ఆర్థిక పరంగా ఏవో గొడవలు వచ్చి ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: