కమ్మోళ్ల ఓట్లు స‌రే.. రెడ్డి ఓట్ల విష‌యంలో ఈ క‌న్‌ఫ్యూజ్ వ‌చ్చేసిందే..?

Divya
పార్టీల ప‌రంగా చూసుకుంటే.. ఏపీలో రాజ‌కీయ నేత‌ల‌కు కుల స‌మీక‌ర‌ణ‌లు ఎక్కువ‌గా ఉంటాయి. ఎన్నిక లను ప్ర‌భావితం చేయ‌గల రెండు కీల‌క సామాజిక వ‌ర్గాలు.. ఎప్పుడూ.. ఎన్నిక‌ల‌ను డామినేట్ చేస్తున్నా యి. ఇలా చూసుకుంటే.. టీడీపీకి అండ‌గా.. క‌మ్మ సామాజిక వ‌ర్గం నిల‌బ‌డింది. ఇప్పుడు కూడా వీరు అలా నే ఉన్నారు. ఎక్క‌డా బెస‌క‌లేదు. పైగా.. 2014, 2019 ఎన్నిక‌ల కంటే కూడా.. ఎక్కువ‌గా క‌సితో ప‌నిచేస్తు న్నారు. చంద్ర‌బాబును మ‌రోసారి సీఎం చేసుకోవాల‌నేదివీరి ఆశ‌.

దీంతో క‌మ్మ వ‌ర్గం ఒక స్తిర‌మైన నిర్ణ‌యంతోనే ముందుకు సాగుతోంది. కానీ, ఎటొచ్చీ.. రెడ్డి సామాజిక వర్గం లోనే ఇంకా త‌ర్జ‌న భ‌ర్జ‌న కొన‌సాగుతోంది. 2014, 2019లో ఈ వ‌ర్గం.. వైసీపీకి చేరువైంది. మావోడు జ‌గ‌న్‌ను సీఎం చేయాలంటూ.. ఊరూవాడా ప్ర‌చారం చేశారు. బ‌ల‌మైన రెడ్లు డ‌బ్బులు కూడా ఖ‌ర్చు పెట్టారు. ఈ నేప‌థ్యంలో 2014లో అధికారం త‌ప్పిపోయినా.. 2019లో మాత్రం జ‌గ‌న్ ట్రెమండ‌స్ విజ‌యం ద‌క్కించు కున్నారు. దీనివెనుక‌.. ఒప్పుకొన్నా.. ఒప్పుకోక‌పోయినా.. ఖ‌చ్చితంగా రెడ్ల స‌హ‌కారం ఉంది.

అయితే.. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో మాత్రం.. జ‌గ‌న్ పాల‌న‌తో రెడ్డి వ‌ర్గానికి ప‌ద‌వులు ద‌క్కాయే త‌ప్ప‌.. నిధు లు స‌మ‌కూర‌లేద‌నే వాద‌న ఉంది. పైగా.. రెడ్డి వ‌ర్గాన్ని ప‌క్కన పెట్టి.. త‌న‌పై రెడ్డి ముద్ర ప‌డ‌కుండా చూసు కునే క్ర‌మంలో ప‌నులు కూడా వారికి ఇవ్వ‌లేదు. పైగా రెడ్ల‌లోనూ పాత‌త‌రం వారికే ప్రాధాన్యం ఇచ్చార‌నే వాద‌న ఉంది. దీంతో ఇప్పుడు రెడ్డి వ‌ర్గం పూర్తిగా వైసీపీకి స‌హ‌క‌రించే ప‌రిస్థితి లేకుండా పోయింది. కొంద‌రు మాత్ర‌మే యాక్టివ్‌గా ఉన్నారు. మ‌రికొంద‌రు మౌనంగా ఉన్నారు.

జ‌గ‌న్ వ‌చ్చినా.. త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని.. త‌మ వ్యాపారాలు పుంజుకుంటున్నాయ‌న్న ధీమా రెడ్డి వ‌ర్గంలో సంపూర్ణంగా క‌నిపించ‌డం లేదు. ఏ సామాజిక వ‌ర్గ‌మైనా.. త‌మ నాయ‌కుడు అధికారంలోకి వ‌స్తే.. త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని సంపూర్ణంగా విశ్వ‌సిస్తారు. కానీ, రెడ్ల విష‌యంలో అది లేక‌పోవ‌డం.. వైసీపీ కి కీల‌క ఎన్నిక‌ల స‌మ‌యంలో పెద్ద ఎదురు దెబ్బ‌గానే క‌నిపిస్తోంది. పైగా ఎస్సీ, ఎస్టీల‌ను న‌మ్ముకున్నా ..పూర్తిగా రెడ్డి వ‌ర్గాన్ని పక్క‌న పెట్టార‌న్న అప‌వాదు.. మాత్రం జ‌గ‌న్‌ను వెంటాడుతోంది. మ‌రో 12 రోజుల్లో ఎన్నిక‌లు ఉన్న ద‌రిమిలా.. ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: