ఓవర్‌కాన్ఫిడెన్స్‌ మరోసారి జగన్‌ను దెబ్బ తీస్తుందా?

విశ్వాసం ఉండటం తప్పు కాదు. కానీ అది మితి మీరితే అతి అవుతుంది. ఇది వారి గెలుపుపై ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే ఏపీ సీఎం జగన్ తన పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో గురించే ఇదంతా. వైసీపీ అధినేత తాజాగా ప్రకటించిన మ్యానిఫెస్టో నవరత్నాలు 2.0 చూసుకుంటే అతి విశ్వాసం నిజమేనా అనిపిస్తోంది. ఎన్నికల వేళ పోటీ ఉన్నప్పుడు ఆయా పార్టీలు అనుసరిస్తున్న తీరును గమనించాల్సి ఉంటుంది.


ఇలా చూసుకుంటే భారీ ఎత్తున హామీలు గుప్పించిన టీడీపీ కూటమి ఉండగా.. అసలు నామమాత్రంగా.. అంటే గత పథకాలకే కాస్త మెరుగులద్దిన వైసీపీ కనిపిస్తోంది. తాను అమలు చేస్తున్న పథకాలకే రూ.70వేల కోట్లు అవుతున్నాయని ఇంతకు మించి అమలు చేసే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. ఇది ఒక రకంగా మంచిదే కానీ..రాజధాని ప్రస్తావన, పింఛన్ల పెంపు వంటి అంశాలు తమను దెబ్బతీస్తాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు.


మొత్తంగా తాను చెప్పేది ప్రజలు నమ్ముతారు అని జగన్ భావిస్తున్నారు. అందుకే చంద్రబాబుని ఇచ్చిన హామీలు అమలు చేయని వ్యక్తిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటే రూ.1.50 కోట్ల వరకు అవసరం అవుతాయని చెబుతూ ప్రచారం చేసుకుంటున్నారు. ప్రతి పక్ష నేతలు ఎంతమంది ఉంటే అంత మందికి అమ్మ ఒడి, ఉచిత బస్సు ప్రయాణం, అధికారంలోకి రాగానే రూ.4వేల పింఛన్ వంటి ప్రజాకర్షక పథకాలు ప్రవేశ పెట్టారు.

కానీ జగన్ వీటిని ఏమీ ప్రకటించకుండా.. తన హామీలనే ప్రజలు విశ్వసిస్తారు అనే రూట్ లో వెళ్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే తెగించే ఈ ఎన్నికలకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఆది నుంచి అంటే అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి మ్యానిఫెస్టో వరకు అన్ని జగన్ తెగించి ముందుకు సాగుతున్నారు. మరి అతి విశ్వాసం పార్టీని విజయ తీరాలకు చేరుస్తుందా లేదా  అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: