క‌మ్మ లేడీ డాక్ట‌ర్‌తో రెడ్డి డాక్ట‌ర్ ఢీ... న‌ల్ల‌మ‌ల‌లో ఉత్కంఠ‌గా యంగ్‌ చిరుత‌ల పోరు ?

RAMAKRISHNA S.S.
- ద‌ర్శిలో బ‌రిలో టీడీపీ నుంచి గొట్టిపాటి ఫ్యామిలీ ఆడ‌ప‌డుచు
- 2019లో పోటీకి దూరం జ‌రిగి ఇప్పుడు రేసులో ఉన్న శివ‌ప్ర‌సాద్‌
- వార్ వైసీపీకి వ‌న్‌సైడ్ నుంచి న‌రాలు తెగే ఉత్కంఠ‌గా మారిన పోరు
( ప్ర‌కాశం - ఇండియా హెరాల్డ్ )
ఇద్దరూ యువ డాక్టర్లు.. అందులోను ఒకరు లేడి, మరొకరు జెంట్. వారిలో ఒక‌రు కమ్మ, మ‌రోక‌రు రెడ్డి. వీరి మధ్య జరుగుతున్న ఆసక్తికర పోరుకు ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం వేదిక కానుంది. నల్లమలలో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, టీడీపీ నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పోటీలో ఉన్నారు. వాటి మీద లేదా వేరే కారణంతోనో 2019 ఎన్నికలలో జగన్ సీటు ఇస్తానన్న నాకు వద్దంటే వద్దు అని చేతులు ఎత్తేసిన బూచేపల్లి.. ఈసారి పోటీకి దిగుతున్నారు. 2009లో చిన్న వయసులోనే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శివ ప్రసాద్ రెడ్డి.. 2014 ఎన్నికలలో ఓడిపోయారు.

ఒక్క ఓటమితోనే ఆయన 2019 ఎన్నికలలో.. ఎన్నికలకు ముందే పోటీ చేయను అని చేతులెత్తేయడంతో.. జగన్ 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన బలిజ సామాజిక వర్గానికి చెందిన మద్దిశెట్టి వేణుగోపాల్‌కు సీట్‌ ఇచ్చారు. జగన్ ప్రభంజనంలో వేణుగోపాల్ విజయం సాధించారు. విచిత్రం ఏంటంటే 2019లో పోటీకి బయపడిన బూచేపల్లి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వేణుగోపాల్‌ను ప్రతిరోజు ఇబ్బంది పెడుతూ వచ్చారు. వేణుగోపాల్ బలిజ సామాజిక వర్గం, శివప్రసాద్ రెడ్డి సామాజిక వర్గం కావటం.. జగన్ సైతం శివప్రసాద్ కి ప్రయారిటీ ఇవ్వడంతో.. దర్శి రాజకీయం ఐదేళ్లపాటు గందరగోళంగానే నడిచింది. ఎమ్మెల్యేను ఇక్కడ శివప్రసాద్ అసలు పట్టించుకోలేదు. అటు జగన్ కూడా ప్రయారిటీ ఇవ్వలేదు. దీంతో గత ఎన్నికలలో దర్శి ప్రజలు వైసిపిని గెలిపించినా ఉపయోగం లేకుండా పోయింది.

దీనికి తోడు శివప్రసాద్ తల్లి వెంకాయమ్మకు జడ్పీ చైర్పర్సన్ పదవి రావడంతో ఆయన నియోజకవర్గంలో పూర్తిపట్టు ప్రదర్శించారు. ఇక అనుకున్నట్టుగానే మద్దిశెట్టికి జగన్ సీటు ఇవ్వలేదు. బూచేపల్లికే ఈ ఎన్నికలలో సీటు కేటాయించారు. మామూలుగా దర్శి వైసీపీకి పట్టున్న‌ సీటు. 2014లోనే ఇక్కడి నుంచి టీడీపీ నుంచి గెలిచిన సిద్ధా రాఘవరావు కేవలం 1300 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎన్నికలకు ముందు వరకు దర్శిలో బూచేపల్లికి తిరిగి లేదు. ఇక్కడ ఎగిరేది వైసీపీ జెండా అని అందరూ అనుకున్నారు. ఎప్పుడైతే ప్రకాశం జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న గొట్టిపాటి కుటుంబం నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ అభ్యర్థిగా ఖరారు అయిందో.. ఒక్కసారిగా టీడీపీకి ఓటు వచ్చేసింది.

20 నుంచి 25వేల పట్ల మెజార్టీతో వైసీపీ గెలుస్తుందన్న అంచనాల నుంచి ఈరోజు నువ్వా, నేనా అనే స్థాయికి వచ్చేసింది. పైగా ముండ్లమూరు మండ‌లం, దర్శి మున్సిపాలిటీ.. దర్శి రూరల్ మండలంలో టీడీపీకి ఎడ్జ్ కనిపిస్తోంది. తాళ్లూరు, దొనకొండ లాంటి చోట్ల వైసీపీకి ఆధిక్యం కనిపిస్తుంది. ఇలా ఎలా చూసిన సామాజిక వర్గాలు, మండలాలు ప్రాంతాలవారీగా చూసిన ఇద్దరికీ సమాన అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ గ్రాఫ్ మాత్రం రోజురోజుకు ఊహకు అందని విధంగా పెరుగుతుంటే.. వైసీపీ గ్రాఫ్ తగ్గుతుంది. ప్రస్తుతానికి అయితే దర్శిలో నరాలు తెగే పోరు నడుస్తోంది. మరి ఈ ఇద్దరు యువ డాక్టర్లలో అంతిమ సమరంలో ఎవరని విజేతగా ? నిలుస్తారు.. అనేది తేలాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: