హిందూపూర్ : బాలయ్యను టెన్షన్ పెడుతున్న 'అగ్గిపెట్టె' గుర్తు..?

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు మరో 12 రోజులు మాత్రమే గడువు ఉంది. ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారంలో  దూసుకుపోతున్నారు.నందమూరి బాలకృష్ణ తన హిందూపూర్ నియోజకవర్గంలో కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపన నుండి హిందూపూర్ నియోజకవర్గం ఆ పార్టీకి ఒక కంచుకోటగా మారింది. అదే నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్ మరియు హరికృష్ణ ఎన్నికలలో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. గత ఎన్నికలలో టిడిపి తరఫున బాలకృష్ణ గారు రెండుసార్లు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు అయితే ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి బరిలో ఉన్నారు నందమూరి బాలకృష్ణ.
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ మరియు బిజెపి అభ్యర్ధి అయిన పరిపూర్ణానంద స్వామి మధ్య బేధాలు వచ్చాయి. పరిపూర్ణానంద స్వామి కి అక్కడనుండి లోక్సభ టికెట్టు రానివ్వకుండా చంద్రబాబుపై  బాలకృష్ణ ఒత్తిడి చేసారని ఆయన అంటున్నారు. ప్రధానంగా బిజెపికి ముస్లిం ఓట్లు పడవని చంద్రబాబుకి చెప్పి కూటమిలో భాగంగా బిజెపికి టికెట్ రానీకుండా చేశారని పరిపూర్ణానంద స్వామి మండిపడ్డారు.దాంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న పరిపూర్ణానంద స్వామి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు అయితే ఎన్నికల సంఘం ఆయనకు అగ్గిపెట్ట గుర్తును కేటాయించింది. దాంతో అగ్గి పెట్టె గుర్తుతో వచ్చి కూటమిలో అగ్గి రాజేసే పనిలో ఉన్నారని అక్కడి టీడీపీ నేతలు అంటున్నారు.
ఏపీలో బీజేపీలో టికెట్ అందుకున్న వారిలో ఎక్కువ మంది టీడీపీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నారనే విషయాన్ని ప్రస్తావించారు. అటు జనసేనలో కూడా చాలా టికెట్స్ తెలుగు దేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్లకే ఇచ్చారనే విషయాన్ని ప్రస్తావించారు.అయితే ఆ నియోజకవర్గంలో ఎవరి బలాలు ఎంత అనే విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణపై తెలుగుదేశం ఓట్లు అలాగే సినీ గ్లామర్ పని చేస్తుంది. స్వామీజీ విషయానికి వస్తే ఆయనకు హిందూ సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. ఆయన చేసిన కొన్ని పనుల వల్ల హిందూ ముస్లింలు తేడా లేకుండా స్వామీజీ వెంట నడుస్తున్నారు. ఈ విధంగా కూటమిలోని నేతల మధ్య సఖ్యత లేకపోవడం చూసి అక్కడి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏదేమైనా ఆ స్వామీజీ యొక్క ప్రభావం బాలకృష్ణపై ఎంతో కొంత పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: