"లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్" మూవీ రన్ టైమ్ లాక్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ని ఏర్పరచుకున్న వారిలో మేర్లపాక గాంధీ ఒకరు. మేర్లపాక గాంధీ , సందీప్ కిషన్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టిన మొట్ట మొదటి మూవీ తోనే మేర్లపాక గాంధీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈ దర్శకుడు ఎక్స్ ప్రేస్ రాజా మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే ఆ తర్వాత కొన్ని మూవీ లకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు.

కానీ ఆ మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో సంతోష్ శోభన్ హీరో గా నటించిన ఫరియా అబ్దుల్లా ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని రేపు అనగా నవంబర్ 4 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది.

ఈ సినిమా 2 గంటల 14 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా సాధారణమైన నిడివి తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది ఇలా ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి మంచి అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: