ఆదిపురుష్ టీజర్ చూసి షాక్ తిన్న ప్రభాస్ అభిమానులు...!!

murali krishna
ప్రభాస్ అభిమానులు చాలా కాలంగా ఎదరుచూస్తున్న ఆదిపురుష్ మూవీ టీజర్ ఎట్టకేలకు అయితే రిలీజ్ అయ్యింది. మొన్ననే శ్రీరాముని గెటప్ లో ప్రభాస్ పోస్టర్ ను రిలీజ్ చేసి ఆసక్తిని పెంచిన చిత్ర బృందం,అక్టోబర్ 2 న అయోధ్య లో గ్రాండ్ గా టీజర్ రిలీజ్ జరుగుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే.


రామాయణ ఇతిహాస నేపథ్యంతో దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ మరియు సన్నీ సింగ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.


అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ బడ్జెట్ తో టీ సిరీస్ మరియు రెట్రో ఫైల్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. చిత్ర నిర్మాణంలో యూవీ క్రియేషన్స్ నుంచి వంశీ, ప్రమోద్ భాగస్వామ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఇక టీజర్ విషయానికి వస్టే : ' భూమి కృంగినా నింగి చీలినా న్యాయం చేతిలోనే అన్యాయానికి సర్వనాశనం'. 'వస్తున్నా.. న్యాయం రెండు పాదాలతోని పది తలల అన్యాయాన్ని అణచివేయడానికి ' అంటూ ప్రభాస్ వాయిస్ ఓవర్ లో టీజర్ అయితే ప్రారంభమైంది. రావణాసురుడుగా చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ పాత్రను కూడా పరిచయం చేశారు.


అలాగే సీత పాత్రలో కృతి సనన్ కూడా చూపించారు. పోస్టర్ లో ప్రభాస్ లుక్ పెద్దగా ఆకట్టుకోలేదు కానీ టీజర్ లో మాత్రం పర్వాలేదు అనిపించిందట.. టీజర్ మొత్తం గ్రాఫిక్స్ తో నిండి ఉంది. వి.ఎఫ్.ఎక్స్ మాత్రం కొంత ఇటీవల వచ్చిన బ్రహ్మాస్త్ర ని గుర్తుచేసింది. అయితే ప్రభాస్ వలనో ఏమో అది పెద్ద లోటుగా అయితే అనిపించదు. ఓవరాల్ గా టీజర్ అయితే పర్వాలేదు అనిపించింది. 2023 జనవరి 12 న సంక్రాంతి కానుకగా ఈ మూవీ హిందీ, తెలుగు,తమిళ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుందని సమాచారం.. టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి:

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: