గోనగన్నారెడ్డి పాత్రను వదులుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా...?

murali krishna
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్క గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇకపోతే కమర్షియల్ హీరోయిన్ గా మాత్రమే కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలు అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసిన ఏకైక హీరోయిన్ అనుష్క.


ఇక బాహుబలి సినిమా హిట్ అయిన సందర్భంగా అనుష్క అనేక లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక అనుష్క నటించిన ఎన్నో సినిమాలలో రుద్రమదేవి కూడా ఒకటి. ఇక ఈ చిత్రం గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కగా ఇందులో అనుష్కతో పాటు అల్లు అర్జున్ అలాగే రానా కూడా ప్రధాన పాత్రలు పోషించి సినిమాకు మూల స్తంభాలుగా నిలిచారు. రుద్రమదేవి సినిమా మంచి విజయం సాధించగా ఇతర భాషలలో సైతం ఈ చిత్రాన్ని చేసి విడుదల చేశారు. ఇకపోతే ఈ చిత్రంలో అల్లు అర్జున్ తెలంగాణ యాస లో నీ మొలతాడు లో నా తాయత్తు అంటూ చెప్పిన డైలాగులకు థియేటర్లలో చప్పట్ల వర్షం కురిసిందని చెప్పాలి. అంతలా తన నటనతో బాగా పాపులారిటీని సంపాదించుకున్నారు అల్లు అర్జున్.. ముఖ్యంగా పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ ఓవరాల్ గా ఆ సినిమాలో అనుష్కతో పాటు అల్లు అర్జున్ కూడా బాగా హైలైట్ గా నిలిచారు. ఇకపోతే ఈ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ నటించిన సంగతి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ పాత్రలో ఎంతోమందిని అనుకున్నారు. కానీ వారు ఎవరు కుదరకపోవడంతోనే చివరికి అల్లు అర్జున్ చేయవలసి వచ్చింది. 


మరి ఆ హీరోలు ఎవరు అనే విషయాన్నికొస్తే ముందుగా మహేష్ బాబు.. మహేష్ బాబును దర్శకుడు గుణశేఖర్ గోనగన్నారెడ్డి పాత్ర కోసం సంప్రదించగా ఆ పాత్ర తనకు సెట్ కాదని తేల్చి చెప్పేసాడట.ఇక తర్వాత ఎన్టీఆర్ దగ్గరికి కూడా ఈ కథ తీసుకువెళ్లగా గోనగన్నారెడ్డి పాత్ర విధానం బాగా నచ్చినప్పటికీ డేట్స్ కాళీ లేకపోవడంతో ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడట ఎన్టీఆర్. ఇద్దరు టాలీవుడ్ హీరోలు కూడా గోనగన్నా రెడ్డి పాత్రను వదులుకోవడంతో చివరికి అల్లు అర్జున్ ఆ పాత్ర చేయడం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: