బర్తడే భాయ్ అప్డేట్.. మహేష్ SSMB -28..?

Divya
తాజాగా మహేష్ బాబు 28 వ సినిమా నుంచి తాజాగా అప్డేట్ విడుదల చేయడం జరిగింది ఈ రోజు మహేష్ బాబు బర్తడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్నామని చిత్ర బంధం అధికారికంగా ప్రకటించడం జరిగింది. బహుముఖ నటన నైపుణ్యం కలిగిన మహేష్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ #SSMB -28 వ షూటింగ్ అని త్వరలో ప్రారంభించబోతున్నామని హ్యాపీ బర్తడే సూపర్ స్టార్ మహేష్ బాబు అంటూ బర్తడే విషెస్ తో ఒకసారి కొత్త పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

మరొకవైపు మహేష్ బాబు బర్తడే విషెస్ తెలియజేస్తే అభిమానుల సైతం ప్రపంచా వ్యాప్తంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మహేష్ బాబుకు సంబంధించిన పాత సినిమాలు కూడా థియేటర్లలో విడుదలవుతూ మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఇక సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కూడా స్వయంగా మహేష్ సామాజిక సేవా కార్యక్రమాలను ప్రసంగిస్తూ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఎంతోమంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు అని తెలియజేశారు.
ఆ భగవంతుడు అతనికి మరింత శక్తిని ఇచ్చి సక్సెస్ ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని బర్తడే హ్యాష్ ట్యాగ్ ను చిరంజీవి తెలియజేశారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా మహేష్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతోంది. తెలుగుదేశం నాయకులు జయదేవుకల్లా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు అందమైన నవ్వు గురించి ప్రస్తావిస్తూ తన బావ గారు హీరో సుధీర్ బాబు కూడా విషెస్ తెలియజేయడం జరిగింది. ఇక మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి కూడా సోషల్ మీడియాలో మహేష్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: