పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు కొలిక్కి వచ్చిందా!!
అయన రాజకీయాల విషయానికొస్తే అక్టోబర్ నుంచి పవన్ కల్యాణ్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు. ఎన్నికలు కూడా దగ్గరపడుతూ ఉండడంతో అయన ప్రజల్లోకి వెళ్లి బలం పెంచుకోవాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ లోపు సినిమాల షూటింగ్స్ అన్నీ కంప్లీట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవాలి కానీ పవన్ ఆ విధంగా అడుగులు వేయట్లేదు అనిపిస్తుంది. ఇప్పటికే తెరకెక్కి విడుదల కావాల్సిన రెండు సినిమాలు ఇంకా షూటింగ్ కి కూడా వెళ్ళకపోవడం అందరిని నిరాశపరుస్తుంది. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తో అయన చేయాల్సిన ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ఇంకా మొదలవనేలేదు.
ఒక షెడ్యూల్ ఈ సినిమా ను మొదలుపెట్టారు కానీ ఆ తర్వాత పలు కారణాల వాళ్ళ ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత హరీష్ శనకర్ భవదీయుడు భగత్ సింగ్ కూడా చేయాల్సి ఉంది కానీ ఆ సినిమా ను సైతం ముందుకు తీసుకెళ్లలేకపోయారు. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలను స్ట్రైక్ అనంతరం మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన రానుంది. మరి ఈ రెండు సినిమాల తర్వాత రెండు సినిమాలను ఒప్పుకున్నాడు పవన్. సముద్ర ఖని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండగా, మరొకటి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న సినిమా ను అయన చేయాలి. అవి ఎప్పుడు మొదలుపెడతాడో చూడాలి.