నాగార్జున 'ది ఘోస్ట్' కిల్లింగ్ మె షీన్ కి యూట్యూబ్ లో సూపర్ రెస్పాన్స్..!

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగార్జున ఈ సంవత్సరం ప్రారంభంలోనే సంక్రాంతి కానుకగా విడుదల అయిన బంగార్రాజు మూవీ తో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. అలా బంగార్రాజు మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న టాలీవుడ్ కింగ్ నాగార్జున మరికొన్ని రోజుల్లో ది ఘోస్ట్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ప్రారంభం  అయ్యి చాలా కాలమే అవుతున్న అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ కాస్త డిలే అవ్వడం వల్ల  ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కూడా జరుపుకుంటోంది. ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుండగా,  టాలీవుడ్ యంగ్ దర్శకులలో ఒకరు అయిన ప్రవీణ్ సత్తార్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. బంగార్రాజు మూవీ తర్వాత నాగార్జున నటిస్తున్న మూవీ కావడం, గరుడ వేగా లాంటి విజయవంతమైన మూవీ తర్వాత దర్శకుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ది ఘోస్ట్ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుండి 'ది ఘోస్ట్ కిల్లింగ్ మెషీన్' అనే పేరుతో ఒక చిన్న టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ టీజర్ లో నాగార్జున కొంత మంది తో కత్తి తో ఫైట్ చేసిన సన్నివేశాన్ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సన్నివేశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఇప్పటికే ఈ టీజర్ యూట్యూబ్ లో అదిరిపోయే రేంజ్ లో వ్యూస్ ను దక్కించుకుంది. ఇప్పటి వరకు ది ఘోస్ట్ కిల్లింగ్ మెషీన్ టీజర్ 48 లక్షల వ్యూస్ ని , 86 కే లైక్ లను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: