సంక్రాంతిని టార్గెట్ చేసిన ఇద్దరు తమిళ స్టార్ హీరోలు..!

Pulgam Srinivas
సంక్రాంతి పండగ వచ్చింది అంటే టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ స్టార్ హీరోల సందడి కనిపిస్తూ ఉంటుంది. సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేయడానికి అనుగుణంగా టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమా షూటింగ్ లను కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ సారి సంక్రాంతి కి కూడా మన తెలుగు స్టార్ హీరోలు తమ సినిమాలను బరిలో నిలపడానికి ఇప్పటి నుండే ప్రణాళికలు రచిస్తున్నారు.  ఇది ఇలా ఉంటే టాలీవుడ్ హీరోలతో పాటు ఇద్దరు కోలీవుడ్  స్టార్ హీరోలు కూడా తమ సినిమాలను సంక్రాంతి బరిలో నిలవడానికి ఇప్పటి నుండే ప్రణాళికలను వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.  

అసలు విషయం లోకి వెళితే... కోలీవుడ్  స్టార్ హీరోల్లో ఒకరైన రజనీ కాంత్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా ఫుల్ క్రేజ్ ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా కోలీవుడ్ , టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉన్న రజనీ కాంత్ మరి కొన్ని రోజుల్లో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం  మనకు తెలిసినదే.  ఈ సినిమా షూటింగ్ ను శర వేగంగా పూర్తి చేసి  ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలపాలని ఉద్దేశంతో  చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాతో పాటు మరో కోలీవుడ్ స్టార్ హీరో తళపతి విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కూడా అయింది.  ఈ సినిమా షూటింగ్ ను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి ఈ సినిమాను కూడా సంక్రాంతి బరిలో నిలపాలని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.  ఇలా ఇద్దరు స్టార్ హీరోలు ఈ సారి సంక్రాంతి బరిలో నిలవణునట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: