బ్లూ డ్రెస్ లో అదరగొడుతున్న శ్రద్ధా దాస్.. అర్థం మూవీ న్యూ లుక్..

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా మంచి స్థానాన్ని అందుకున్న హీరోయిన్ శ్రద్ధా దాస్ ఇటీవల కాలంలో హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంది. ఈనేపథ్యంలో తనకు ఇప్పుడు ఓ మంచి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అర్థం అనే సినిమా లో ఆమె ఓకీలక పాత్ర లో నటిస్తుంది. మణికాంత్ తాళ్లగూటి దర్శకత్వంలో సైకలాజికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా లో మాస్టర్ మహేంద్రన్ ముఖ్య పాత్ర లో నటిస్తున్నాడు. మల్టీలాంగ్వేజ్ లలో విడుదల అవుతుంది ఈ సినిమా.
తాజాగా ఈ సినిమా లో శ్రద్ధా దాస్ లుక్ ను యూనిట్ ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసింది. ఇది ఎంతో ఆకర్షణీయంగా ఉందని చెప్పొచ్చు. ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ లుక్ ఉంది. చేతిలో పుస్తకం తో తీక్షణంగా ఆలోచిస్తున్నట్లు ఉన్న లుక్ చూస్తుంటే అన్వేషణ నేపథ్యంలో కొనసాగే చిత్రమని చెప్పొచ్చు. ఆమె మాయ అనే మానసిక వైద్య నిపుణురాలిగా ఆమె ఈ చిత్రంలో కనిపిస్తుంది. ఈ పోస్టర్ ఆమె క్యారక్టర్ డిఫైన్ చేస్తూ చాలా పవర్ ఫుల్ అని తెలిపేలా ఉంది.
ఈ సినిమా ను మినర్వా పిక్చర్స్ బ్యానర్ పై రాధికా శ్రీనివాస్ నిర్మించగా ఈ సినిమా లో తెలుగు తమిళ మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే కన్నడ, హిందీ భాషల్లోకి డబ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే వచ్చిన మ్యూజికల్ టీజర్ కి మంచి రెస్పాన్స్ రాగ సినిమా పై కూడా అంచనాలను భారీ పెంచారు. అరుదైన చర్మ వ్యాధి తో బాధపడుతున్న ఒక పేషెంట్ లలో ఒకడైన వైతరణ్ హత్యా చేశాడని నమ్మిన మాయ అతని తో ఎలా ప్రవర్తిస్తుంది. ఆ హత్యా యొక్క మిస్టరీ ను ఎలా ఛేదిస్తుంది అనేదే ఈ సినిమా కథ. పలువురు ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు చేసిన ఈ సినిమా విడుదల తేదీ తొందరలోనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: