విజయ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..జననాయగన్ రిలీజ్ కి లైన్ క్లియర్..!

Divya
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన చివరి చిత్రం జననాయగన్. వాస్తవంగా ఈ సినిమా జనవరి 9వ తేదీన విడుదల కావలసి ఉండగా, సెన్సార్ సర్టిఫికెట్ వ్యవహారం వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతోంది. అయితే గడిచిన కొద్దిసేపటి క్రితం జననాయగన్ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ CBFC కి మద్రాస్ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. అలాగే ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేయాలంటూ సూచించింది. దీంతో జననాయుగన్ సినిమాకి అన్ని లైన్ల క్లియర్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు శుక్రవారం రోజున కోర్టు తీర్పు తెలియజేసింది.


దీంతో అటు విజయ్ ఫ్యాన్స్ ని ఆనందపరుస్తోంది. త్వరలోనే అధికారికంగా ఒక కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించబోతున్నారు. జననాయగన్ చిత్రాన్ని డైరెక్టర్ హెచ్ వినోద్ కుమార్ దర్శకత్వం వహించగా ఈ సినిమా అటు విజయ్ కి పొలిటికల్పరంగా కూడా కలిసొచ్చే విధంగా తెరకెక్కించినట్లు సమాచారం. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ అభిమానుల అంచనాలను అందుకుంది. కానీ మొదటి నుంచి ఈ సినిమా  బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా రీమిక్  అని ప్రచారం అయితే జరుగుతోంది. ట్రైలర్లో కొన్ని సీన్స్ అలాగే ఉండడంతో దీంతో విజయ్ యాంటీ ఫ్యాన్స్ సైతం చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు.


విజయ్ కి జోడిగా పూజ హెగ్డే నటించగా కీలకమైన పాత్రలో మమిత బైజు నటిస్తోంది. అలాగే గౌతమ్ వాసుదేవ్ మీనన్, హీరోయిన్ ప్రియమణి, బాబీ డియోల్ తదితర నటీనటులు నటిస్తున్నారు. హీరో విజయ్ చివరి సినిమా కావడం చేత ఈ సినిమా పైన అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. అన్ని అనుకూలిస్తే ఈ చిత్రాన్ని ఈనెల 14వ తేదీన విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్లో వినిపిస్తున్నాయి. విజయ్ తన చివరి సినిమాతో ఎలాంటి రికార్డులను తిరగరాస్తారో చూడాలి మరి. సంగీతాన్ని అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: