ఆ హీరో నాకు హ్యాండిచ్చాడు : అరియనా
ఈ క్రమంలోనే మీ కోరిక ఏంటి అంటూ రామ్ గోపాల్ వర్మను అడుగగా.. నిన్ను బికినీలో చూడాలని ఉంది అంటూ రామ్ గోపాల్ వర్మ సమాధానం చెప్పడంతో ఈ అమ్మడు ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. చాలా మందికి సుపరిచితురాలు గా మారిపోయింది. ఇక ఈ ఒక్క ఇంటర్వ్యూ తోనే అటు బిగ్ బాస్ హౌస్ లో అవకాశాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక్కడ బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఈ అమ్మడు దర్శనమిచ్చింది. ఇటీవలి కాలంలో సినిమా అవకాశాలు కూడా దక్కించుకుంటుంది.
ఇటీవలే రాజ్ తరుణ్ హీరోగా నటించిన అనుభవించు రాజా అనే సినిమాలో కూడా నటించింది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అరియనా తనకు హీరో రాజ్ తరుణ్ పై ఉన్న కోపాన్ని బయటపెట్టేసింది. ఓసారి ఇంటర్వ్యూకి పిలిచి నన్ను వెయిట్ చేయించాడు. చివరికీ రాకుండా డబ్బింగ్ పని ఉంది అంటూ వెళ్లిపోయాడు. అంతకుముందు కూడా ఓ ఇంటర్వ్యూకు ఇలా వెయిట్ చేయించి ఇంటర్వ్యూ ఇవ్వకుండానే హ్యాండ్ ఇచ్చాడు. అందుకే రాజ్ తరుణ్ పైన నాకు ఎంతగానో కోపం ఉంటుందిఅంటూ అని చెప్పుకొచ్చింది అరియనా.