రఫ్ ఆడిస్తానంటున్న యువహీరో

Prasad
తెలుగు ప్రేక్షకులకు రఫ్ అనే పదం బాగా సుపరిచితం. ‘రఫ్ అడిస్తా’ అనే డైలాగ్ తో ఈ పదాన్ని మెగాస్టార్ చిరంజీవి తెలుగులో బాగా పాపులర్ చేశారు. కాగా, ఇప్పుడు ‘రఫ్’ అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతుంది. సాయికుమార్ కుమారుడు ఆది ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ‘ప్రేమకావాలి’, ‘లవ్లీ’, ‘సుకుమారుడు’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది ఈ సినిమాలో పూర్తి స్థాయి మాస్ కారెక్టర్ చేస్తున్నాడు.

సుబ్బారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ‘రఫ్’ సినిమాను అభిలాష్ నిర్మిస్తున్నాడు. రఖుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఆది రఫ్ ఆడించటం ఖాయమని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: