హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎం‌ఐ‌ఎం ఎమ్మెల్యేకి ఫిరోజ్ ఖాన్ చెక్?

హైదరాబాద్ నగరంలో ఎం‌ఐ‌ఎం పార్టీకి ఎంత బలం ఉందో చెప్పాల్సిన పని లేదు...రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిస్తితులు ఉన్నా సరే హైదరాబాద్ లో ఓ 7 అసెంబ్లీ స్థానాలు, హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఎం‌ఐ‌ఎం విజయాన్ని ఎవరు అడ్డుకోలేరనే చెప్పొచ్చు..ఆఖరికి టీఆర్ఎస్ సైతం..ఈ ఏడు నియోజకవర్గాల్లో చేతులెత్తేస్తుంది...ఏదో మొక్కుబడిగానే పోటీకి దిగుతుంది. ఇలా ఏడు నియోజకవర్గాల్లో ఎం‌ఐ‌ఎంకి కంచుకోటలుగా ఉన్నాయి.
అలా ఎం‌ఐ‌ఎంకి కంచుకోటలుగా ఉన్న స్థానాల్లో నాంపల్లి కూడా ఒకటి...ఇక్కడ ఎం‌ఐ‌ఎం హవా కొనసాగుతూనే ఉంది. వరుసగా నాంపల్లిలో ఎం‌ఐ‌ఎం సత్తా చాటుతూనే ఉంది. ఇక గత రెండు ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఎం‌ఐ‌ఎం తరుపున జాఫర్ హుస్సేన్ గెలుస్తూ వస్తున్నారు...ఇక మూడోసారి కూడా నిలబడి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు..అయితే ఇక్కడ ఎం‌ఐ‌ఎంకి చెక్ పెట్టే సత్తా ఒక్క కాంగ్రెస్ కు తప్ప మరో పార్టీకి లేదనే చెప్పాలి. ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీల పాత్ర నామ మాత్రమే...నాంపల్లిలో కాంగ్రెస్ తోనే ఎం‌ఐ‌ఎంకి చిక్కులు.
అది కూడా మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ తోనే ఎం‌ఐ‌ఎం ఎమ్మెల్యేకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఫిరోజ్ గత మూడు ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వస్తున్నారు..2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోగా, 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు..2018 ఎన్నికలోచ్చేసరికి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 9 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు.
అయితే ఈ సారి కూడా ఫిరోజ్ కాంగ్రెస్ నుంచే పోటీకి దిగనున్నారు...ఈ సారి మాత్రం విజయం సాధించాలనే కసితో ఫిరోజ్ పనిచేస్తున్నారు...పైగా వరుసగా ఓడిపోతున్న సానుభూతి ఆయనపై ఉంది...ఇక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ బలంగానే కాస్త పెరిగితే...నాంపల్లి సీటులో ఫిరోజ్ గెలవడం ఈజీ అని చెప్పొచ్చు. కాకపోతే నెక్స్ట్ గాని నాంపల్లిలో టీఆర్ఎస్ పోటీ చేయకుండా ఎం‌ఐ‌ఎంకి గాని సపోర్ట్ చేస్తే...కాంగ్రెస్ గెలుపు సాధ్యం కాదు. చూడాలి మరి ఫిరోజ్ ...ఎం‌ఐ‌ఎం ఎమ్మెల్యేకు చెక్ పెడతారో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి:

mim

సంబంధిత వార్తలు: